ఇదీ కృష్ణమనోహర్‌ ఐపీఎస్‌ సీక్రెట్

తెలుగు సినిమాలో హీరోయిజాన్ని కొత్తదారి పట్టించిన ఘనత దర్శకుడు పూరి జగన్నాథ్‌ది. ఆయన సినిమాల్లో హీరోలు కొత్తగా ఉంటారు. అంతే కొత్తగా మాట్లాడతారు. వాళ్లు పైకి ఇడియట్‌ లా కనిపించినా లోలోపల మంచితనం దాగే ఉంటుంది. పోకిరిలా పోజులు కొట్టినా ఆ మాస్క్‌ వెనుక కృష్ణమనోహర్‌ ఐపీఎస్‌లు ఉంటారు. ఈ ఫార్ములాతోనే ఎన్నో విజయాల్ని అందుకున్నారు పూరి.

చాలా కాలంగా పూరి జగన్నాథ్‌ ఖాతాలో సరైన సినిమా పడలేదు. ఇస్మార్ట్‌ శంకర్‌ ఆ లోటు తీరుస్తుందని నమ్మకంగా చెబుతున్నారు పూరి. పూరి దర్శకత్వంలో రామ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో పూరి విలేకరులతో ముచ్చటించారు.

హిట్టు, సూపర్ హిట్టు సినిమాలు చాలానే ఉంటాయి కానీ బ్లాక్ బస్టర్ మూవీలు కొన్నే ఉంటాయి. ఆ కోవకే వస్తుంది మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ. పూరి అనగానే పోకిరి…పోకిరి అనగానే క్లైమాక్స్‌ ట్విస్టు గుర్తొస్తాయి. ఈ సినిమాలో అప్పటివరకూ ఆకతాయిగా కనిపించే కుర్రాడు ఒక అండర్ కవర్ కాప్ అన్న విషయం క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ తో సినిమాను మరింతగా కనెక్ట్ అయ్యేలా చేసిందని చెప్పాలి.

అదే పోకిరికి కనీవినీ విజయాన్ని అందించింది. ప్రిన్స్ మహేష్ బాబు కాస్తా సూపర్ స్టార్ మహేష్ బాబు అయిపోయారు. ఈ ట్విస్టు వెనుక ఉన్న కథని పూరి గుర్తు చేసుకున్నారు. మహేష్‌కి పోకిరి కథ చెప్పేటప్పుడు క్లైమాక్స్‌ ముందున్న ట్విస్టు వినగానే చాలా ఉత్సాహపడ్డారు. అయితే షూటింగ్‌ సమయంలో నేను కంగారు పడ్డాను.

ఈ ట్విస్టు పోకిరి విడుదలైన తొలి రోజు మార్నింగ్‌ షోకే తెలిసిపోతుంది. తరవాత చూసే ప్రేక్షకుడు ముందే మహేష్‌ని పోలీస్‌ అని ఊహించుకుంటాడు. తనకి అంత థ్రిల్‌ ఉంటుందా? లేదా? అని భయపడ్డాను. కానీ ప్రేక్షకులు ఆ ట్విస్టుని మర్చిపోయి సినిమాని ఆస్వాదించారు. ఈ సినిమాలో మహేష్‌ ఒకే ఒక్కసారి పోలీస్‌ యూనిఫామ్‌లో కనిపిస్తారు.

ఆ స్టిల్‌ విడుదలకు ముందే బయటకు లీక్‌ అయిపోతుందేమో అని, నా స్టిల్‌ ఫొటో గ్రాఫర్‌ని కూడా సెట్‌కి రానివ్వలేదు. కృష్ణ మనోహర్‌ ఐపీఎస్‌.. బ్యాచ్‌ నెంబర్‌ 32567.. అంటూ నాజర్‌ డైలాగ్‌ చెబుతారు. బ్యాచ్‌ నెంబర్లతో రాస్తే కొంచెం భారీగా ఉంటుందనిపించింది. కానీ ఐపీఎస్‌లకు బ్యాచ్‌ నెంబర్లుంటాయని కూడా నాకు తెలీదు.

షూటింగ్‌ సమయంలో చూద్దాంలే అనుకుని 32567 అంటూ నా ఫోన్‌ నెంబర్‌లోని చివరి అంకెలు రాశా. హడావుడిలో అలానే షూటింగ్‌ చేసేశాం. నా స్నేహితుల్లో ఐపీఎస్‌లు ఉన్నారు. ఈ బ్యాచ్‌ నెంబరేంట్రా అని వాళ్లలో ఒక్కరూ అడగలేదు. అంతలా సినిమాలోని ఆ ట్విస్ట్ అందరికీ కనెక్ట్ అయిపోయింది. ఇదీ కృష్ణమనోహర్‌ ఐపీఎస్‌ కథ.

పోకిరి చిత్రం మహీష్ కెరీర్ లొనే కాదు, తెలుగు ఇండస్ట్రీ రికార్డ్స్ లో కూడా ఒక సెన్సేషన్. పూరి జగన్నాధ్ ట్రేడ్ మార్క్ డైలాగ్స్, మహీష్ బాబు మార్క్ మేనరిజం ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అది. పండుగాడు గా మాస్ రోల్ లో మహేష్ వెండితెరపై వీర విజృంభణ చేశాడు. ఇందులో మహేష్ మ్యానరిజం నుంచి డైలాగ్స్ వరకు అన్నీ కూడా జనాలకు బాగా కనెక్టయ్యాయి.

ఈ చిత్ర షూట్ కూడా కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేసారు. ఫస్ట్ వీక్ అంతా మిక్సెడ్ టాక్ తో నడిచి ఆ తరువాత నెమ్మదిగా పేస్ పికప్ చేసి తెలుగు చలన చిత్ర చరిత్రలో కొత్త రికార్డులని సృష్టించింది పోకిరి. పోకిరి ఒక కనీవినీ ఎరుగని సంచలనం. అప్పటివరకు మన సౌత్ ఇండియా లో 40 కోట్లు+ షేర్ కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం పోకిరి.

మొత్తంగా 63 సెంటర్లలో 175 రోజులు ఆడింది పోకిరి. కొత్త ట్రెండ్ కి నాంది పలికిన చిత్రం గా చరిత్ర లో నిలిచిపోయింది. అటు మాస్ ఇటు క్లాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ ని ఒక ఊపు ఊపేసిన చిత్రం పోకిరి. మాస్ సినిమా అంటే ఇలానే ఉండాలి అని కొత్త అర్ధం చెప్పిన సినిమా పోకిరి. ఇకపై ఇదే టెక్ట్స్ బుక్.

పోకిరి కి వచ్చిన కలెక్షన్లు చూసి టోటల్ ఇండియన్ ఇండస్ట్రీ షాక్. ప్రతీ ఇండస్ట్రీ పోకిరి రీమేక్ చేయాలని తహతహలాడింది. తమిళంలో విజయ్‌తో ప్రభుదేవా (2007) రీమేక్ చేశారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌తో ప్రభుదేవా (2009) రీమేక్ చేశారు. కన్నడంలో దర్శన్ (2010), బెంగాలీలో షకిబ్ ఖాన్ (2014) చేశారు. పోకిరి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.

పోకిరి సినిమాకు సంబంధించి కొన్ని విశేషాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొన్ని వెరీ ఇంట్రస్టింగ్ ముచ్చట్లు! * ఇందులో మహేష్ బాబు ముద్దుపేరు ‘పండు’. పూరి భార్య లావణ్య ముద్దు పేరు అదే. * మహేష్ బాబు క్లైమాక్స్‌లో ప్రకాష్ రాజ్‌ని గూబ మీద కొడితే కాసేపు ఆయనకు ఏమీ వినపడకుండా మొత్తం సెలైన్స్ అయిపోతుంది. థియేటర్లో ఈ సీన్‌కి మామూలు రెస్పాన్స్ రాలేదు. మొదట అందరూ సౌండ్ ప్రాబ్లం అనే అనుకున్నారు. ఈ ఐడియా ఫైట్‌మాస్టర్ విజయన్‌ది.

* శివమణి షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లినప్పుడు అక్కడో గిటారిస్టు లిజన్ టు ద ఫాలింగ్ రెయిన్ పాట ప్లే చేస్తుంటే విని ఆశ్చర్యపోయారు పూరి. అది అచ్చం సూపర్‌స్టార్ కృష్ణ నటించిన గౌరి (1974) సినిమాలోని గలగల పారుతున్న గోదారిలా పాటలా ఉంది. ఎలానూ కృష్ణ గారి పాట కాబట్టి, మహేష్ పై తీస్తే కొత్తగా ఉంటుందనుకున్నారు పూరి. ఆయన అంచనా ఫలించింది. గలగలపారుతున్న గోదారిలా పాట సూపర్‌హిట్.

Share

Leave a Comment