ఎంతో ఆశక్తి గా ఎదురుచూస్తున్నా….

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత‍్వంలో తన సిల్వర్‌ జూబ్లీ సినిమాను చేయనున్నాడు. ప్రతిష్టాత్మక 25 వ చిత్రం కోసం నిర్మాతలు అన్ని ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

తన అందచందాలతో కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఫూజ హెగ్డే. తాజాగా ఈ వయ్యారి మహేష్‌ బాబు సరసన లక్కీ ఛాన్స్ కొట్టేయడం విశేషం. మహేష్ సినిమాలో ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ మాత్రం కాదంటుంది.

ఇది తనకు ఖచ్చితంగా మేజర్ బ్రేక్ అవుతుంది అని నమ్ముతోంది పూజా. భరత్ అనే నేను షూటింగ్ పూర్తి కాగానే ఇది సెట్స్ పైకి వెళ్తుంది. ఇప్పటికే దేవి శ్రీప్రసాద్ ఈ చిత్రానికి ట్యూన్స్ కూడా సిద్ధం చేశారని వినికిడి.

ప్రస్తుతం రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘సాక్ష్యం’ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా గురించి ఒక ప్రత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాల గురించి మరియూ మహేష్ తో పని చేసే అవకాశం రావదం గురించి ఈ విధంగా వివరించారు –

“సూపర్ స్టార్ మహేష్, డైరెక్టర్ వంశీ కలయికలో బ్యూటిఫుల్ చిత్రం లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది, అందరం కలిసి ఓ అందమైన సినిమా మీకందించేందుకు ఎదురుచూస్తున్నాం.

ఈ సినిమా చాలా బిగ్ స్కేల్ లో చిత్రీకరించనున్నారు, అందులోను మహేష్ తో కలిసి పనిచేయడం కోసం ఎంతో ఆశక్తి గా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా ఒక చక్కటి కధాంశం తో రాబోతుంది.

ఈ సినిమా తో నాకు మంచి పేరు వస్తుంది అని నమ్మకం ఉంది, నా పాత్ర ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే రివీల్ చేయలేను.. కాని తప్పకుండా మీ అందరికి నచ్చే విధంగా ఉంటుందని మాత్రం చెప్పగలను.

ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విషయాలు అతి త్వరలో చిత్ర యూనిట్, ప్రొడక్షన్ హౌస్ వారు ఆఫిషియల్ గా అన్నౌన్స్ చేయనున్నారు.” అని పూజ తెలిపింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాను మహేష్ ఇదే ఇయర్ తీసుకురానున్నాడు. అందుకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను అంతా దర్శకుడు పక్కా ప్లాన్ తో సెట్ చేసుకుంటున్నాడు.

మహేష్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో చేస్తోన్న భరత్ అనే నేను మార్చి కల్లా పూర్తి కానుండడంతో, ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.

షూటింగ్ ఎక్కువగా యూఎస్ లో జరుగుతుందట. అమెరికా నేపథ్యంలో నడిచే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శక-నిర్మాతలు ఒకసారి అమెరికా వెళ్లి, లొకేషన్లు పరిశీలించి వచ్చారు.

కొన్నిటిని ఎంపిక చేశారు కూడా! ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ జరిపి, తర్వాతి షెడ్యూల్‌ అమెరికాలో జరపడానికి ప్లాన్‌ చేస్తున్నారు. సినిమాను ఈ ఏడాది లోనే రిలీజ్ చేయనున్నారు.

సంఖ్యా పరంగా మహేష్ కెరియర్ లో ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకోవడంతో, వంశీ పైడిపల్లి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా సమాచారం.

Share

Leave a Comment