హీరో అంటే మహేష్‌లా ఉండాలంటున్న

సూపర్‌స్టార్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా మరియు ఓవర్సీస్ లో ఉండే ప్రవాస భారతీయులందరికీ సుపరిచితమైన పేరు మహేష్ బాబు. ఇక ప్రతీ ఏడాది దేశ వ్యాప్తంగా మోస్ట్ ‌డిజైరబుల్‌ మెన్ ఇండియా టాప్‌ లిస్ట్‌లోనూ ఆయన చోటు దక్కించుకుంటునే ఉన్నారు.

అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే. ఈ జాబితా లోకి పూజా కుమార్ కూడా చేరింది. మహేష్ ని పొగడ్తలతో ముంచెత్తింది. ఒక ఇంటర్వ్యూ లో పూజా ని మీరు తెలుగు సినిమాలు చుస్తారా అని అడగ్గా, దానికి ఆమె నేను మహేష్ బాబు నటించిన రెండు తెలుగు సినిమాలు చుసాను. నేను మహేష్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని..”హి ఈజ్ సింప్లీ అమేజింగ్” అని ప్రశంసించింది.

“మహేష్ ఎటువంటి రోల్ ని అయినా అవలీలగా చేస్తాడు. చాల తక్కువ మందికి ఇటువంటి ఈజ్ ఉంటుంది. మహేష్ ఒక పక్క డ్రామ చేయగలడు, మరో పక్క ఎమోషన్, ఇంకొక పక్క యాక్షన్, అలానే కామెడీ.. వావ్. హి ఈజ్ ఎ ఫెంటాస్టిక్ హీరో. నా ఉద్దేసం లో మహేష్ బాబు అంటే ఎపీటోమ్ ఆఫ్ హీరో.

హీరో అనే పదానికి అసలైన నిర్వచనం మహేష్..ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలడు..అదే మహేష్ ని అందరికంటే స్పెషల్ గా నిలబెడుతుంది..ఐ యామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్. ఆయనకి ఒక స్పెషల్ చార్మ్ ఉంటుంది” అని పూజ కుమార్ ఖితాబు ఇచ్చింది.

మహేష్ అంటే తమకి ఇష్టం అని ఇప్పటికే పలు మార్లు అనేక ఇతర భాషా నటీమనులు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు. అందం, యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఇవన్నీ కలిసి మహేష్ ను సిల్వర్ స్క్రీన్ ప్రిన్స్ ను చేసేశాయి.

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సిల్వర్‌ జూబ్లీ మూవీగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగబోతోంది. 20 రోజులు పాటు అక్కడే షూటింగ్ జరిపి తరువాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. అందుకోసం భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. చాలా యంగ్ గా, రఫ్ లుక్ లో ఆకట్టుకున్నారు మన సూపర్ స్టార్. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Share

Leave a Comment