మహేష్ కు పవన్ స్వీట్ రిప్లై!

నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా అభిమానులు, సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖులు అయనకి శుభాకాంక్షలు అందజేశారు. అయితే ఇందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందించడం మోస్ట్ హైలెట్ గా చెప్పాలి

హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్. నీ గొప్ప గుణాలు ప్రేరణను కలిగిస్తాయి. నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటాలని కోరుకుంటున్నాను అని పవన్ తో గతంలో ఉన్న ఓ ఫోటోను జత పరుస్తూ మహేష్ బాబు ట్వీట్ చేశారు

పవన్ బర్త్ డేకి మహేష్ ట్వీట్ చేయడంతో ఇద్దరు హీరోల అభిమానులు సంతోషంలో మునిగి తేలారు. మహేష్ నుంచి చాలా ఏళ్ల తర్వాత ఇలా పవన్ కోసం ఒక ట్వీట్ రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయింది

అయితే మహేష్ ట్వీట్ కి పవన్ రిప్లయ్ ఇస్తాడా లేదా అన్న ఓ సందేహం అందరిలో మొదలైంది. ఆ సస్పెన్స్ కి తెర దించుతూ పవన్ రిప్లయ్ ఇచ్చారు. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మహేష్ బాబు గారు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు

దీనితో ఇద్దరు హీరోల అభిమానుల్లో ఆనందం మరింత రెట్టింపు అయింది. ఇండస్ట్రీలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు స్టార్ హీరోలు అన్న సంగతి తెలిసిందే. అయితే అభిమానులకి మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అనే భావన సహజంగా ఉంటుంది

కానీ మా హీరోల మధ్య ఆలాంటి భావన మా మధ్య లేదని పాటుగా పలు సభల్లో చెప్పారు. ఇక అభిమానులు కూడా కలిసి ఉండాలని అప్పుడే ఇండస్ట్రీ కూడా బాగుంటుందని చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ తో కలిసి పవన్ మల్టీస్టారర్ లో నటించే వీలుందా?

అన్నదే ఇప్పుడు తెలుగు సినీఅభిమానులలో టాపిక్. అయితే అది ఇప్పట్లో పాజిబుల్ కాకపోయినా ఆ కాంబినేషన్ ని కలిపే మోస్ట్ పవర్ ఫుల్ స్క్రిప్టు సరైన దర్శకుడు దొరికితే మాత్రం కష్టమేమీ కాదన్నది అభిమానుల ఆలోచన

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు షార్ట్ గ్యాప్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారిపాట సినిమాను ఎనౌన్స్ చేశాడు, అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

Share

Leave a Comment