మహేష్ థియేటర్‌లో ప్రభాస్

సూపర్ స్టార్ మహేష్‌బాబు ఇటీవలే ఏఎంబీ సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఏఎంబీ సినిమాస్ ను గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మించారు. సాధారణ మల్టిప్లెక్సుల కంటే ఒక మెట్టు ఎక్కువ గా రిచ్ ఇంటీరియర్స్ తో, లగ్జరీకి మారు పేరుగా ఈ మల్టి ప్లక్స్ పేరు తెచ్చుకుంది.

ఏ సినిమా విడుదలైనా కూడా సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అంతా కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్‌కు పరుగులు పెడుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ఇటీవలె థియేటర్లలోనికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వీక్షించేందుకు ప్రభాస్ సోమవారం ఏఎంబీ మాల్‌కు విచ్చేశారు. ప్రభాస్‌కు ఏఎంబీ మాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

దాంతో సర్‌ప్రైజ్ అవ్వడం అభిమానుల వంతైంది. మధ్యాహ్నం 12 గంటల షో చూడటానికి ప్రభాస్ గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ థియేటర్స్‌కు వెళ్లారు. ఎలాంటి హంగామా లేకుండా పార్కింగ్ స్థలం నుంచి వీఐపీ లిఫ్ట్‌లో థియేటర్‌ లోపలికి వెళ్లిపోయారు. ప్రభాస్ రాకతో ఏఎంబి సినిమాస్ ప్రాంగణం మొత్తం ఎంతో సందడిగా మారిపోయింది.

తమ అభిమాన హీరోతో కలిసి సాహోని చూసే అవకాశం దక్కినందుకు ఫాన్స్ కేరింతలతో థియేటర్ మారుమోగింది. ప్రభాస్‌తో‌పాటు నిర్మాత ప్రమోద్ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు. అతి తక్కువ సమయంలోనే ఈ మల్టీప్లెక్స్‌కు మంచి పేరు దక్కింది. హైస్టాండర్డ్ వసతులు, టాప్ క్లాస్ టెక్నాలజీతో నిర్మించిబడిన ఈ మల్టీప్లెక్స్ ను సినీ సెలబ్రిటీలు సైతమ్ ప్రత్యేకంగా చూస్తున్నారు.

థియేటర్ లో డిజైన్, ప్రస్తుత టెక్నాలజీతో ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా వీక్షించి అనుభవం, సౌండ్ ఎఫెక్ట్స్, స్క్రీనింగ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అందుకే సినిమా చూసేందుకు అందరి మొదటి చాయిస్ ఏఎంబీ సినిమాస్ అయ్యింది. ప్రభాస్ కూడా దీనికే ఓటు వేసారు.

ప్రభాస్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సాహో. శ్రద్ధ కపూర్, ప్రభాస్ సరసన జోడి కట్టిన ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మది అందించిన ఫొటోగ్రఫీ, అలానే జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానాకర్షణగా చెప్పుకోవచ్చు. సాహో ని చూస్తూ చాలా ఎంజాయ్ చేసారు ప్రభాస్.

కమర్షియల్ ప్రయోజనాలే కాకుండా సామాజిక సేవల పరంగానూ ఏఎంబీ సినిమాస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనేక ఛారిటీ కార్యక్రమాల కోసం ఉచితంగా సినిమాల ప్రదర్శనతతో మహేష్‌ బాబు ఆశయాలకు అనుగుణంగా నడుస్తోంది ఏఎంబీ సినిమాస్. తాజాగా ఏఎంబీ సినిమాస్ కు బెస్ట్ మల్టీప్లెక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది.

ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం 7 థియేటర్లున్నాయి. 5 స్టార్ వాతావరణంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. మొత్తం 1638 సీట్ల సామర్థ్యం ఉంది. వి.ఐ.పి లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, లగ్జరీ థియేటర్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.

పార్టీ జోన్, వీవీఐపీ లాంజ్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ తదితర సదుపాయాలు ఏఎంబీ సినిమాస్‌లో ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో జనాల చూపు అంతా ఏఎంబీ సినిమాస్ పైనే. ఈ ఏరియాలో రద్దీ విపరీతంగా పెరిగింది. మొత్తం మీద మహేష్ ఏఎంబీ సినిమాస్‌ మామూలుగా లేదు. ఏఎంబీ సినిమాస్ అందరి హాట్ ఫ్యావెరెట్ గా మారిపోయింది.

Share

Leave a Comment