క్రేజీ ప్రాజెక్టు రేసు మొదలయింది

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్స్ పోటీ పడుతుంటారు. మార్కెట్ లో మహేష్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. తొలి చిత్రంతో ఘనవిజయం అందుకున్న యువ దర్శకులు కూడా మహేష్ తోనే తమ తదుపరి చిత్రం ఉండాలని ప్లాన్ న్నారంటే మహేష్ క్రేజ్ ఎంటే తెలుస్తుంది.

అర్జున్ రెడ్డి చిత్రంతో అందరి దృష్టి తనవైపుకు తిప్పుకున్న సందీప్ వంగా సూపర్ స్టార్ మహేష్ తో టచ్ లో ఉంటున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కంఫర్మ్ అయినట్టు తెలిసిందే. మధ్యలో సుకుమర్ సినిమా పూర్తి అయ్యాక ఇది మొదలవనుంది. ఎప్పుడో ప్రారంభమయ్యే సందీప్ మహేష్ సినిమా కోసం నిర్మాతల మధ్య ఇప్పటి నుంచే రేసు మొదలైనట్లు తెలుస్తోంది.

మహేష్ తో ఓ బడా చిత్రాన్ని నిర్మించాలని మెగా నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారట. సందీప్, మహేష్ కాంబినేషన్ లో రూపొందే చిత్రాన్ని నిర్మించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా టాక్ వినపడుతుంది. ఇప్పుడు కొత్తగా మరొక న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది.

ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూడా ఈ క్రేజీ కాంబోలో రూపొందే చిత్రాన్ని నిర్మించేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. సందీప్ తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’ని హోల్ సేల్ గా కొని పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం ద్వారా అతడితోనూ మంచి సంబంధాలే ఉన్నాయి సునీల్ కు.

అతడి నుంచి కూడా కమిట్మెంట్ తీసుకున్న సునీల్ మహేష్ సినిమా కోసం గట్టిగా ప్రయత్నాలు జరుపుతున్నారు అని వినికిడి. మహేష్ ఎవరికి పచ్చ జెండా ఊపుతాడో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. మహేష్ కి ప్రస్తుతం ఉన్న డిమాండ్ అలాంటిది మరి. రోజు రోజు కి ఆయన క్రేజ్ రెట్టింపు అవుతుంది.

ప్రస్తుతం మహేష్ మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం తరువాత సుకుమార్ దర్శత్వంలో సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు నిర్మించనున్నారు. ఈ లెక్కన సందీప్ వంగా మరో ఏడాది వరకూ వేచి ఉండక తప్పదు.

Share

Leave a Comment