అందుకే రాలేకపోయాను

టాలీవుడ్‌ దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ది సెపరేట్ స్టైల్. కథ మాటలు స్క్రీన్‌ప్లే హీరో క్యారెక్టర్ డిజైనింగ్ ఇలా ప్రతి విషయంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. మరో పక్క సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అనే సంగతి తెలిసిందే

ఈ ఇద్దరి కాంబినేషన్ లో మంచి అంచనాల మధ్య వచ్చిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరు అనుకున్నపటికి అప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని తిరగరాస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు అనడంలో అతిశయోక్తి లేదు

పోకిరి ఒక సంచలనం. ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని పూరీ కూడా ఊహించలేదని చాలా సందర్భాలలో స్వయంగా చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే బిజినెస్ మ్యాన్ వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది

అయితే ఒకానొక సందర్భంలో మూడవసారి మహేష్ పూరి కలిసి సినిమా చేయాలనుకున్నారు. ఇందుకోసం ఒక ప్రాజెక్ట్ కూడా అనుకున్నాడు పూరి. హ్యాట్రిక్ హిట్ కొట్టాలనుకున్న కసితో జనగణమన అన్న కథ కూడా మహేష్ కోసమే రాసినట్టు పూరి చాలా సందర్భాలలో చెప్పాడు

కాని అనుకున్న జనగణమన తెరకెక్కలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అని ఆ గ్యాప్ వల్ల చాలామంది మహేష్ పూరి మధ్య విభేధాలు వచ్చాయని అక్కడకడ రూమర్స్ వచ్చాయి. కాని పూరీ చెప్పిన కథ నచ్చితే మహేష్ చేసేందుకు రెడీగానే ఉన్నాడట

ఇవన్ని పక్కన పెడితే మహేష్ అంటే పూరి కి ఎంత అభిమానమో తాజాగా సర్కారు వారి పాట ప్రూవ్ చేసింది. ఇటీవల సర్కారు వారి పాట సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పూరి దర్శకుడు పరశురాం కి శుభాకాంక్షలు తెలుపుతూ విష్ చేశాడు

సర్కారు వారి పాట చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కచ్చితంగా మహేష్ బాబు అభిమానులందరికీ పెద్ద ట్రీట్ అవుతుంది అంటూ మహేష్ బాబు మీద పూరి కి ఉన్న అభిమానాన్ని తెలిపాడు. అంతేకాదు తాను ముంబై లో ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయాని తెలిపాడు

మహేష్ పూరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని మహేష్ అభిమానులు అంటున్నారు. మహేష్ పూరి మధ్య మనస్పర్థలు ఉన్నాయన్న పుకార్ల కు ఇప్పుడు ఈ ట్వీట్ చెక్ పెట్టింది అని చెప్పొచ్చు

పూరీని త‌ను ఎంత‌గానో అభిమానిస్తున్న‌ట్టు అంతకముందు మహేష్ తెలియ‌జేశాడు. మహేష్ ట్వీట్ లో పూరి తన ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరని చెప్పడం విశేషం. మీరు ఎప్పుడూ సంతోషంగా విజయోత్సాహంతో ఉండాలని, మీ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు

దీని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. ఈ రెండు చిత్రాలలో మహేష్ మేనరిజాన్ని పూరి కొత్తగా ఆవిష్కరించారు. రెండూ సంచలనాలు గా నిలిచాయి

Share

Leave a Comment