చాలా ఆనందంగా ఉందంటూ…

ఈ జెనరేషన్ టాలీవుడ్‌ దర్శకుల్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, హీరో క్యారెక్టర్ డిజైనింగ్ ఇలా ప్రతి విషయంలోనూ ఆయనది ప్రత్యేకమైన శైలి.. సినిమాల మేకింగ్‌ విషయంలో పూరి చాలా ఫాస్ట్‌. నిన్న ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియచేస్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన జనగణమణ సినిమా ఆగిపోయింది. దీంతో వీరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది అని అందరూ అనుకున్నారు

కాని పూరి బర్త్‌డే సందర్భంగా మహేష్ విషెస్ తెలియచేశారు. మహేశ్ ట్వీట్ పట్ల పూరి జగన్నాథ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దానికి ఆయన అదే రీతిలో ప్రతిస్పందించారు కూడా. మహేష్, పూరి మధ్య మనస్పర్థలు వున్నాయన్న పుకార్లకు ఈ ట్వీట్స్ చెక్ పెట్టింది

మహేశ్ సార్ మీ నుంచి శుభాకాంక్షలు అందుకోవడం సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. లవ్యూ ఆల్వేస్ అని సమాధానమిచ్చారు పూరి. అంతే కాకుండా పోకిరీ మరియూ బిజినెస్‌మాన్ సినిమాల్లోని వర్కింగ్ స్టిల్స్ ని కూడా ట్వీట్ చేసి ఆ మెమరీస్ అద్భుతమని కొనియాడారు

అంతకముందు పూరీని త‌ను ఎంత‌గానో అభిమానిస్తున్న‌ట్టు ట్వీట్ ద్వారా మహేష్ తెలియ‌జేశాడు. మహేష్ ట్వీట్ లో పూరి తన ఫేవరేట్ డైరెక్టర్స్ లో ఒకరని చెప్పడం విశేషం. నా అభిమాన డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు

మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయోత్సాహంతో ఉండాలని, మీ భవిష్యత్ బాగుండాలని కోరుకుంటున్నాను అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు సూపర్ స్టార్ మ‌హేష్. దీని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది

జ‌న‌గ‌ణ‌మ‌న పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాన‌ని అప్ప‌ట్లో అఫీషియ‌ల్‌గా పేర్కొన్నాడు. ఈ సినిమా మహేష్ తో చేస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం పూరితో మరో మూవీ చేయాలని కోరుకుంటున్నారు

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. పోకిరి ఇండస్ట్రీ హిట్ అందుకోగా బిజినెస్ మెన్ సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు చిత్రాలలో మహేష్ మేనరిజాన్ని పూరి కొత్తగా ఆవిష్కరించారు. రెండూ సంచలనాలు గా నిలిచాయి

ప్రస్తుత దర్శకుల్లో సరిలేరు నీకెవ్వరు అంటూ పూరి జగన్నాధ్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సమకాలీన దర్శకుల్లో ఏ ఒక్కరు కూడా పాతిక సినిమాలు కూడా చేయలేక పోయారు. కాని ఇప్పటికే ఆయన 37 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Share

Leave a Comment