ఎప్పటికీ నాతోనే ఉండిపోవాలి

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌ తరుణ్‌ తరువాత వరుస సినిమాలతో బిజీగా కనిపించాడు. కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. ఆ చాట్ సెషన్ లో కొన్ని ఆశక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు రాజ్ తరుణ్

ఓ అభిమాని “మీకు మహేష్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు..మీరెప్పుడు మహేష్ ని కలిసి ఫోటో దిగుతున్నారు? ఎప్పుడు ఆ పిక్ ని ట్విటర్ లో షేర్ చేసి మాకు చూపించబోతున్నారు” అని అడిగాడు. దానికి రాజ్ తరుణ్ స్పందించిన తీరు చూస్తే తనకి మహేష్ అంటే ఎంత అభిమానమో తెలిసింది.

నేను మహేష్ గారిని ఎప్పుడో కలిసాను పిక్ కూడా దిగేసాను..కాని నేను ఆ పిక్ ని పోస్ట్ చేయదలుచుకోలేదు.. అది నేను చనిపోయేవరకు నాతో ఉండిపోతుంది. అంత పర్సనల్ నాకు అది..మహేష్ అంటే అంత ప్రాణం నాకు అని తెలియజేసాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇంకొక అభిమాని “మీ మొబైల్ వాల్‌పేపర్ ఇంకా మహేష్ స్టిల్ ఉందా మార్చేసారా అని అడగగా”, ఎన్ని సార్లు ప్రూవ్ చేసుకోవాలి బ్రదర్ నా మొబైల్ వాల్‌పేపర్ అప్పటికి ఇప్పటికి మహేష్ సార్ సినిమా స్టిల్ అని చెప్పాడు. ఇల చెప్పడం తో పాటు ట్వీట్ లో లాస్ట్ కి లవ్ సింబల్ కూడా జతపరిచాడు రాజ్ తరుణ్.

దానికి స్పందిస్తూ మరొక అభిమాని “మన సూపర్‌ స్టార్‌ కల్ట్ ఫ్యాన్ రాజ్ తరుణ్ అన్న మొబైల్‌ వాల్‌పేపర్‌ ఇదిగోండి’ అన్న కామెంట్‌తో మొబైల్‌ వాల్‌ పేపర్‌ స్క్రీన్‌ షాట్‌ను రాజ్‌తరుణ్‌కు ట్యాగ్ చేశాడు. ఈ కామెంట్‌ ని రాజ్‌ తరుణ్‌ రీట్వీట్ చేసి “ఇప్పటికీ అదే నా మొబైల్ వాల్‌పేపర్‌” అంటూ రిప్లై ఇచ్చాడు.

ఈ సందర్భంగా మరొక అభిమాని “అన్నా.. మాకు పోకిరి లాంటి సినిమా కావాలి మీ నుండి” అని అడగగా..దానికి రాజ్ తరుణ్ స్పందిస్తూ ” పోకిరి ఒకటే సినిమా బ్రదర్..అది ఒక కల్ట్ బ్లాక్‌బస్టర్ ..అలాంటి సినిమా మన తెలుగు లో మరలా రాదు.. రాలేదు కూడా” అని ట్వీట్ చేసారు.

టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా పరిశ్రమలోకి వచ్చిన రాజ్ తరుణ్ హీరోగా నిలదొక్కుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరంటే మహేష్ బాబు కి వీరాభిమానిని అని.. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ముందుగా నిఖిల్ పేరే చెప్పాడు.

హిట్లకు ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సినిమా సినిమా కి క్రేజ్ ని పెంచుకునే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ ఒకరు. మామూలుగా ఎవరికైనా విజయాలు లభించినప్పుడే అలా జరుగుతుంటుంది. కానీ పరాజయాలు కూడా మహేష్‌ స్థాయిని పెంచుతుంటాయి. ఇప్పుడే కాదు… మొదట్నుంచీ కూడా మహేష్‌ జయాపజయాలతో సంబంధం లేకుండా సత్తా చాటుతుంటారు.

క్రేజ్ విషయం లో మహేష్ రేంజ్ వేరుగా ఉందని చెప్పాలి. స్టార్‌ వ్యాల్యూ ఇండస్ట్రీలో వినిపించే మాట. ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. అందులో సూపర్ స్టార్ ప్రధమ స్థానం లో ఉంటారు. వ్యాపారంలో అతని క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

వచ్చే ఏడాది జనవరిలో తన కొత్త చిత్రాన్ని ప్రకటిస్తానని అలాగే ఒక కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని ట్విట్టర్ లో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు ఇచ్చాడు. మరి ఈ చిత్రం తో రాజ్ తరుణ్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడు అని అభిమానులందరూ ఆశిస్తున్నారు.

Share

Leave a Comment