సూపర్‌స్టార్ ఇంట రాఖీ పండుగ

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు నివాసంలో రాఖీ పండుగ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. లిటిల్ ప్రిన్సెస్ సితార త‌న అన్న‌య్య గౌత‌మ్‌కి రాఖీ క‌ట్టింది. వాటికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను నమ్రత తన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ ఫోటోలకు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. తన సోదరుడు తన కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు అన్న నమ్మకం. ఆ ఆశతోనే సోదరీమణులు అందరూ ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అని పోస్ట్ చేసి ఈ ఫొటోలను జత చేసారు నమ్రత. ఆ ఫొటోలు మీకోసం.

1)

2)

3)

4)

మహేష్ బాబు ఇంట్లో ప్రతి పండగకు సంబంధించిన వేడుకలు జరుగుతాయి. పిల్లలకు మన సాంప్రదాయాలు, పద్దతులు అలవడేలా స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటారు నమ్రత మరియు మహేష్ బాబు. సితార, గౌతమ్ లకు సంబంధించిన ప్రతి మూమెంటును నమ్రత తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు.

గౌత‌మ్‌ని చూస్తుంటే చిన్న‌ప్ప‌టి మ‌హేష్‌లా క‌నిపిస్తున్నాడంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. గౌత‌మ్ ఇప్ప‌టికే 1 నేనొక్క‌డినే చిత్రం ద్వారా వెండితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ఇక సితారకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ‌హేష్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్ని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంధాన క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు.

Share

Leave a Comment