ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం

కొరటాల శివ దర్శకతంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను ఎంత ఘనవిజయాన్ని సొతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇందులోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫైట్స్ అందులోనూ దుర్గా మహల్ ఫైట్ అభిమానులను ఉరూత్తలూగించింది. ఆ ఫైట్స్ ని కంపోజ్ చేసింది రామ్ లక్ష్మణ్ మాస్టర్లు.

ప్రిన్స్ మహేష్ బాబు మాట్లాడుతూ ‘రామ్ లక్ష్మణ్ మాస్టలను చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. బయట నుంచి చూస్తే చాలా వయలెంట్‌గా ఉంటారు. కానీ లోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. వాళ్లు పొద్దున లేస్తారు. యోగా చేస్తారు. సింగిల్ బేటాతో ఫైటర్లను తిప్పికొట్టేస్తుంటారు. వాళ్లతో రెండు సినిమాలు పనిచేశాను కానీ వాళ్లిద్దరిలో రామ్ ఎవరో, లక్ష్మణ్ ఎవరో తెలియదు’ అని అన్నారు. ప్రిన్స్ మాటలకు రామ్, లక్ష్మణ్ ఇద్దరూ సంబరపడి పోయారు.

దానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ స్పందిస్తూ, మహేష్ గారు మా గురించి అంత మంచిగా చెప్పడం తో మేము చాలా ఆనందపడ్డాము. మమ్మల్ని మా బాడీ లాంగ్వేజి ని సరిగ్గా అర్ధం చేసుకున్న మహేష్ గారికి చాలా థాంక్స్ చెప్పాలి. ఆయన అంత సరదాగ ఉండే హీరో లు మరెవరూ ఉండరేమో అని ప్రశంసల వర్షం కురిపించారు.

ఆయనలో 20 పర్సెంట్ ఆయన చేసేదాంట్లో మనం చేస్తే చాలు, ఎక్కడో ఉంటాం. బాబు పెట్టే ఎఫర్ట్, ఆయన చేసే వన్ మోర్ లు కాని, వ్రుత్తి పట్ల ఆయనికున్న ప్యాషన్ అధ్బుతం. ఆయన్ని చూస్తే మాకు కూడా అంత ఇంటరెస్ట్ తో చేయాలి అని ఉంటుంది. మహేష్ గారితో చెయ్యాలి అని మాకెప్పుడు ఆశక్తిగానే ఉంటుంది.

ఆయన ఎప్పుడు కూడా అంతే కమిట్మెంట్ తో ఉంటారు. మనం చెప్పినవన్ని అర్ధం చేసుకుని, చిన్న చిన్న మైన్యూట్ డీటేల్స్ ని కూడా అర్ధం చేసుకుని చాలా బాగా చేస్తారు. చిన్న చిన్నవి మిస్ అయిన వన్ మోర్ అని పర్ఫెక్షన్ వచ్చేవరకు చేస్తారు.

బహుశా సినిమాని ఇంతలా ప్రేమించేవారు మరెవ్వరూ ఉండరేమో అని అనిపించేలా ఉంటారు మహేష్. ప్రతి మనిషి తను చేసే పని ని నిజంగా మనస్పూర్తిగ ప్రేమిస్తే ఆ పనే మనం ఎమిటో నిరూపిస్తుంది అని బాబు ని చూసి మేము నేర్చుకున్నాము అని తమకు మహేష్ తో ఉన్న అనుభందం గురించి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు తెలియజేసారు.

Share

Leave a Comment