మరో రేర్ ఫీట్‌కు రెడీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు కెరీర్ లో భరత్ అనే నేను, మహర్షి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత సరిలేరు నీకెవ్వరు మరో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.

ఈ సినిమాతో మహేష్ సరికొత్త రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు. కలెక్షన్ల పరంగా ఎన్ని సంచలనాలని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. అన్ని చోట్లా నాన్ బాహుబలి రికార్డులన్ని బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అరుదైన వేడుకను చిత్ర యూనిట్ నిర్వహించేందుకు రెడీ అవుతోందని సమాచారం.

ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనున్న సంద్భంగా 50 డేస్ ఫంక్షన్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు అని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ వేడుక
నిజంగా ఉందా, ఉంటే ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తారనే అంశంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

ఇటీవల కాలంలో 50 రోజులు పూర్తి చేసుకున్న సినిమాల సంఖ్య చాలా తక్కువ. అలాంటిది ఇంత దిగ్విజయంగా ఈ మార్కు ని దక్కించుకుంది అంటే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో జనాలకి ఎంతగా నచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేష్ ఈ అరుదైన ఫీట్ సాధించడంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదో వారం వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్ళని సాధిస్తూ దూసుకు పోతుంది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. రిలీజ్ రోజునే ఈ సినిమాకు మంచి టాక్ సొంతం కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎగబడ్డారు.

ఈ రేంజి కలెక్షన్స్ అది కూడా కాంపిటీషన్ లో అంటే మాములు విషయం కాదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గాక ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో సరిలేరు నీకెవ్వరు హంగామా కనిపిస్తోంది. రెండు వారాల తర్వాత కూడా సరిలేరు నీకెవ్వరు మంచి అదిరిపోయే వసూళ్లనే తీసుకొస్తుంది.

వరుసగా మూడు బ్లాక్ బస్టర్ మూవీస్, ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసర్స్ ఆఫ్ తెలుగు సినిమా లో 3 మూవీస్ ఉన్న ఏకైక హీరో మహేష్ బాబు. బాక్ టు బాక్ వంద కోట్ల షేర్ సినిమాలతో మన సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి.

మహేష్ తన తదుపరి సినిమా బాధ్యతలను మరోసారి వంశీ పైడిపెల్లి చేతిలో పెట్టాడు. గతంలో మహేష్ వంశీ పైడిపెల్లి కాంబోలో వచ్చిన మహర్షి సూపర్ డూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. నెవ్వర్ బీఫోర్ క్యారెక్టర్‌తో రాబోతున్న సూపర్ స్టార్ అని ఫిల్మ్‌నగర్ సమాచారం.

మహర్షి చిత్రం తర్వాత మహేష్‌, వంశీల కాంబోలో రాబోతున్న చిత్రం అవ్వడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అందరి అంచనాలాకి అందుకునేలా తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెల్తున్నాట్టు సమాచారం. కనుక అందుకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను సిద్దం చేయిస్తున్నారు.

Share

Leave a Comment