మహేష్‌ మెసేజ్‌కి రషీద్‌ ఖాన్ స్పందన

సూపర్ స్టార్ మహేష్ బాబుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రతీ మ్యాచ్ ని చాలా కీన్ గా ఫాలో అవుతారు. పలుమార్లు స్టేడియాలకి వెళ్ళి మరీ మన టీం ఇండియా మ్యాచ్ లని ప్రత్యక్షంగా వీక్షించారు మహేష్. మహేష్ కొడుకు గౌతం తరుచుగా ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరవుతుంటాడు.

ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోతున్న సంగతి తెలిసిందే. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, కోల్‌క‌తా నైట్‌రైడర్స్ మధ్య నిన్న జరిగిన క్వాలిఫ‌య‌ర్‌ మ్యాచ్‌ చాలా ఆసక్తి కరంగా జరిగింది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ విజయం సాధించి ఫైనల్ కు అర్హత సాధించారు.

నిన్న జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తో కోల్‌క‌తా టీంకి క‌ళ్ళెం వేసిన ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ టీంలో కీలక ప్లేయ‌ర్‌గా ఉన్న ఆట‌గాడు రషీద్ ఖాన్‌. రషీద్ ఖాన్‌ నిన్నటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న ట్విట్ట‌ర్ ద్వారా ర‌షీద్ నీకు నా సెల్యూట్ అని అన్నారు. స‌న్ రైజ‌ర్స్ స‌మిష్టి కృషి వ‌ల‌న ఫైన‌ల్‌కి వెళ్ళారు. కంగ్రాచ్చులేష‌న్స్‌. ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్ కోసం వెయిట్ చేయ‌లేక‌పోతున్నాను.

గో ఆరెంజ్ ఆర్మీ అంటూ త‌న ట్వీట్‌లో తెలిపారు మ‌హేష్‌. దీనికి స‌మాధానంగా ర‌షీద్ త‌న ట్వీట్‌లో ధ‌న్యవాదాలు సోద‌రా వాచింగ్ యువర్ మూవీస్ కీన్లీ అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆఫ్ఘ‌నిస్తాన్ దేశ అధ్య‌క్షుడు ర‌షీద్ ఖాన్ మా హీరో అంటూ అత‌డిని ఆకాశానికి ఎత్త‌గా, టాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా ర‌షీద్ ఖాన్ ఆల్‌రౌండ‌ర్ ప‌ర్‌ఫార్మెన్స్‌ని మెచ్చుకున్నారు. ర‌షీద్ ఖాన్ బ్యాటింగ్‌లో కేవలం 10 బంతుల్లో 34 రన్స్ చేశాడు. అనూహ్యంగా రషీద్‌ ఖాన్‌ ఎదురుదాడికి దిగి సిక్సర్లతో హోరెత్తించాడు.

శివమ్‌ మావి వేసిన 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన తను ప్రసిధ్‌ కృష్ణ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో మరో రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదాడు. ఆ తర్వాత 4 ఓవర్లు వేసి కేవలం 19 పరుగులిచ్చి కీలకమైన మూడు వికెట్లు (రాబిన్ ఊతప్ప, క్రిస్ లిన్, ఆండ్రూ రసెల్) పడగొట్టాడు.

ఫీల్డింగ్‌లోనూ రెండు అద్భుతమైన క్యాచ్‌లు, ఒక రన్అవుట్ చేసి హైదరాబాద్‌ను ఐపీఎల్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆదివారం ఫైనల్లో చెన్నైతో తలపడుతుంది స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌. ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరడం స‌న్‌రైజ‌ర్స్ కు ఇది రెండోసారి.

Share

Leave a Comment