ఫుల్ గా ఎగ్జైట్ అవుతుందే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వరుస హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నిర్మితం అవుతున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు లో మహేష్ తో మొదటిసారి జోడీ కట్టే అవకాశం దక్కించుకున్నారు. మహేష్ లాంటి పెద్ద స్టార్ తో చేయడం రష్మికకు ఇదే మొదటి సారి కావడంతో ఫుల్ గా ఎగ్జైట్ అవుతునట్లు ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పెడుతున్న పోస్ట్‌ల బట్టి అర్థమవుతుంది.

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ మొదటి షెడ్యూల్ అంటే కాశ్మీర్ షూటింగ్ లో రష్మిక పాల్గొనలేదు. ఆమె హైదరాబాద్ లో జరిగిన రెండో షెడ్యూల్ లో కొద్ది రోజుల క్రితం జాయిన్ అయ్యారు. నిన్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ గురించి అభిమానులతో ఒక అప్డేట్ ను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకున్నారు రష్మిక.

తన ట్విట్టర్ ద్వారా నాకు సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. అద్భుతమైన మనుషులు..ఎన్నో నవ్వులు పువ్వులు..పొట్టచెక్కలయ్యే క్షణాలు. మళ్ళీ ఎంత త్వరగా జాయిన్ అవుతానా అనిపిస్తోంది అంటూ ట్వీట్ చేసారు రష్మిక. దీన్ని బట్టే రష్మిక సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ను ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారో మనకు అర్థం అవుతుంది.

అంతకు ముందు కూడా తాను షూటింగ్ లో జాయిన్ అయినప్పటి నుంచీ ఎప్పటికప్పుడు సరిలేరు నీకెవ్వరు షూటింగ్ విశేషాల్ను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు రష్మిక. రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆశక్తికర ఫొటోను షేర్ చేసారు. అనిల్ తన సిస్టర్స్ తో అని తను, సంగీత, రంజిత ఉన్న ఫొటోను పోస్ట్ చేసారు రష్మిక.

సీనియర్ నటి విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, సంగీత, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన సరిలేరు నీకెవ్వరు మేకర్స్, 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్‌ప్రైజ్ ఇచ్చారు. సరిలేరు.. నీకెవ్వరూ అంటూ ఇంట్రోలో వినిపించిన టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.

భగభగమండే నిప్పుల వర్షం వచ్చినా.. జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు.. పెలపెలమంటూ మంచు తుపాను వచ్చినా.. వెనుకడుగేలేదంటూ దాటేవాడే సైనికుడు…అంటే సాగే పాటకు 1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించిన ఫొటోలను జోడించి ఎడిటింగ్ చేశారు.

ఆయా దృశ్యాలన్నీ రోమాంచితంగా ఉన్నాయి. వీడియో చివరిలో మాత్రమే మహేష్ సైనికుడి లుక్ ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. ఇక ఈ చిత్రంలో మహేష్ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా పేరుతో సరిలేరు నీకెవ్వరూ అంటూ వినిపించిన బ్యాగ్రౌండ్ సాంగ్ అభిమానులకు ఆకట్టుకుంటంది.

ఇంత సీరియస్ గా ఉన్న థీమ్ సాంగ్ ని చాలా కాలం తర్వాత సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే రాయడం విశేషం. దీపక్ బ్లూ పాడగా కోరస్ సహకారంతో మంచి ఫీల్ వచ్చేలా దీని కంపోజిషన్ జరిగింది. భరత్ అనే నేను తరహలో ఈ టైటిల్ సాంగ్ కూడా మైండ్ లో ఎక్కేసి వైరల్ అయ్యే లాగా ఉంది. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్.

సంక్రాంతి 2020 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అందుకు సౌకర్యవంతంగా సినిమాని పూర్తి చేసి ప్రచారానికి ప్లాన్ చేశారు. ఇక మునుముందు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని సంగతులు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ రైలు కూత పెట్టింది మొదలు పరుగే పరుగు అన్నట్లు నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేస్తుంది సరిలేరు నీకెవ్వరు టీమ్.

Share

Leave a Comment