సరదాగా అనుకుంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా మహర్షితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. మహర్షి తర్వాత మహేష్ బాబు తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే సినిమా తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది. రష్మిక మందన కథానాయిక. 2018లో తెలుగు పరిశ్రమలోకి వచ్చిన ఆమె ఏడాదిన్నర కూడా కాకూండానే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసారు. దీంతో అప్పుడే స్టార్ హీరోయిన్ల జాబితాలో నిలబడిపోయారు రష్మిక.

అయితే ఇది వరకు ఒకసారి మహేష్ బాబు గురించి ఆయనతో సినిమా చేసే సంగతి గురించి కొన్ని ఆశక్తికర ట్వీట్లు చేసారు రష్మిక. కొన్ని నెలల క్రితం ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు చేసారు ఆవిడ. సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించి ఒక పదంలో చెప్పండి అని అభిమాని ఒకరు రష్మికను అడిగారు. దానికి రష్మిక జవాబిస్తూ ఇలా ట్వీట్ చేసారు.

నేను కూడా సర్ ని కలవాలనుకుంటున్నా. కలిసి వచ్చాక అప్పుడు సర్ గురించి నీకు ఒక పదంలో చెబుతాను అని ట్వీట్ చేసారు. మరొక అభిమాని మహేష్ బాబు, రష్మిక ల స్పెషల్ వీడియోను చేసి ఇది ఎలా ఉంది అండీ, దీని గురించి చెప్పండి రష్మిక గారు అని ట్వీట్ చేసారు. ఆ వీడియో చూసిన రష్మిక ఎంతో హ్యాపిగా తన ఆనందాన్ని తెలియజేస్తూ ఈ విధంగా మరో ట్వీట్ చేసారు.

ఈ వీడియో ఎవరు చేసారో గాని అతనికి/ఆమెకి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మీరు వంద లేక అంతకంటే ఎక్కువ ఏళ్ళు బతకాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేసారు రష్మిక. మరో అభిమాని మీకు మహేష్ బాబు గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వస్తే..మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మాకు మీరిద్దరు కలిసి నటిస్తే చూడాలని చాలా ఆతురత గా ఉంది, మీ రెస్పాన్స్ కొసం వెయిటింగ్ అని ప్రశ్న వేసారు.

దానికి రష్మిక తనదైన శైలి లో స్పందించారు. నా రియాక్షన్ అయితే ఇలా ఉంటుంది అండీ, హా..హా..హా..చాలా ఫన్నీ..నేను మహేష్ సార్ తో కలిసి ఒకటే మూవీ లో ఆయన రేంజి కి మ్యాచ్ చేసి మహేష్ సార్ లాగా యాక్ట్ చేయడమా? జోక్ గా అనిపిస్తుంది అని అప్పుడు జవాబిచ్చారు రష్మిక. ఇప్పుడు కొన్ని రోజుల తరువాత చూస్తే ఆ జోక్ యే నిజమయ్యింది.

1)

2)

3)

4)

సరిలేరు నీకెవ్వరు లో మహేష్ కు జోడీగా నటిస్తున్నారు రష్మిక. మరి ఇప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటో అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనీల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.

చిత్రంలోని మహేష్ బాబు పాత్ర పేరు అనిల్‌ రావిపూడి తాజాగా రివీల్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా మారారని, కాశ్మీర్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. పోకిరిలో కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా కనిపించిన మహేష్ బాబు ఒక్కడులో అజయ్ వర్మ, దూకుడులో అజయ్ కుమార్ ఐపీఎస్‌గా నటించాడు.

సరిలేరు నీకెవ్వరులో పోకిరిలో కృష్ణ, ఒక్కడు, దూకుడులో అజయ్ కలిపి మేజర్ అజయ్ కృష్ణగా అలరించనున్నారు. ఆ చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ పేరు కూడా కలిసి ఉండడం మరో హిట్టు సెంటిమెంట్ గా వారు భావిస్తున్నారు. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది.

కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో దేశభక్తితో పాటు, కామెడీ, యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉంటాయట. చాన్నాళ్ళ తరువాత విజయశాంతి గారు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఇక రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటల రికార్డింగ్‌ పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎఫ్ 2 సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి, మహర్షి బ్లాక్‌బస్టర్ తరువాత మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రారంభానికి ముందే సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Share

Leave a Comment