మహేష్ గురించి రష్మిక ఏమన్నారంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఫ్యామిలీ పర్సన్ గా చాలా సింపుల్ గా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. ఆయన చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు. చాలా మంది హీరోయిన్స్ కి మహేష్ తో కలిసి నటించాలని ఉంది అని ఇప్పటికే చాలా సందర్భాలలో వెల్లడించారు.

ఇప్పుడు ఈ జాబితా లోకి రష్మిక మందన కూడా చేరారు. మహేష్ తో నటించాలని ఉంది అని తన కోరిక బయట పెట్టారు రష్మిక. సాండల్ వుడ్ భామ రష్మిక మండన్న అంటే కన్నడ చిత్ర సీమ లో పేద్ద క్రేజ్ . అతి తక్కువ సినిమాలతో అంత ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న నటీమనులలో రష్మిక ఒకరు.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ రష్మిక. ఆమె చేసిన కిరిక్ పార్టీ కన్నడ లో ఘన విజయం సాధించడంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది. అంతే కాకుండా ఆ సినిమా తెలుగు లో నిఖిల్ హీరోగా రిమేక్ కూడా అయిన విషయం తెలిసిందే.

తెలుగు చిత్రం ‘ఛలో’ తో టాలివుడ్ లో అడుగు పెట్టారు రష్మిక. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఇక్కడ కూడా ఫుల్ పాపులర్ అయిపోయారు రష్మిక మందన. తాజాగా హైదరాబాద్‌కు వచ్చారు రష్మిక. హైదరాబాద్‌ గురించి మాట్లాడుతూ తనకి హైదరాబాద్ చాలా నచ్చింది అని, ఇక్కడ హాస్పిటాలిటీ అద్భుతమని కొనియాడారు.

తెలుగు సినిమాలు ఎక్కువగా చూడలేదని కాని హీరోల్లో మహేష్ అంటే చాలా ఇష్టం అని ఆయనతో కలిసి నటించాలనుందని వెల్లడించారు. గ్లామర్‌ పాత్రలే కాకుండా నటకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నా అని చెప్పారు. కథానాయికల్లో అయితే అనుష్కను ఎక్కువగా ఇష్టపడతాను అని తెలిపారు రష్మిక.

ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ అంద‌గ‌త్తెలు సైతం అద‌రాల్సిందే. మహేష్ అంటే తమకి ఇష్టం అని ఇప్పటికే పలు మార్లు అనేక ఇతర భాషా నటీమనులు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. మహేష్ కి నేషనల్ లెవెల్ లో ఉన్న క్రేజ్ అలాంటిది.

మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న తన 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్‌ కనిపించబోతున్నారు. 2019 ఏప్రిల్‌ 5న మహేష్‌25 సినిమా విడుదల కానుంది.

Share

Leave a Comment