నాకే తెలియకుండా అయిపోయింది..

అదృష్టం అంటే రష్మికదే. తొలి సినిమాతోనే హిట్టు తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత మహేష్‌బాబు తో చేసిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం తో ఆమె అమాంతం పెద్ద హీరోయిన్స్ రేంజి కి దూసుకెల్లిపోయింది. ఇప్పుడు రష్మిక డేట్స్ కోసం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో సూపర్‌స్టార్ మహేష్ బాబు గారి గురించి సరిలేరు నీకెవ్వరు లో తనతో కలిసి వర్క్ చెసిన అనుభవం గురించి మరో సారి అందరికీ తెలియజేసింది రష్మిక. ఆ ఇంటర్వ్యూ విశేషాలేంటో మనమూ ఒక లుక్కేద్దాం మరి.

స్వీట్‌, కూల్‌, హ్యాండ్సమ్‌ అంటూ పాట పాడాను కదా. ఆ లక్షణాలన్నీ మహేష్ లో కనిపిస్తాయి. సినిమా షూటింగ్ సమయంలో సెట్ లో ఎంత డెడికేటడ్ గా ఉండాలో చూసి నేర్చుకున్నాను. రాబోవు తరాలకు ఆయన ఆదర్శం అని చెప్పడంతో సందేహం లేదు.

నా కెరీర్ తొలి రోజుల్లోనే మహేష్ లాంటి సూపర్ స్టార్ తో ఒక సినిమా కొసం కలిసి పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహేశ్‌ సర్ తో తో డ్యాన్స్‌ చేయడం చాలా ఎంజాయ్‌ చేశా. నేను డ్యాన్స్‌ చేస్తానా లేదా అని నాకే పెద్ద అనుమానం. డ్యాన్స్‌ బాగానే చేస్తున్నావే అంటూ అందరూ ఆశ్చర్యపోయారు.

నా సినిమాలన్నీ మహేశ్‌ సర్ చూశాననే చెప్పారు. నిజానికి ఆయన ప్రతి సినిమా చూస్తారు. కాబట్టి నా సినిమాలూ తప్పకుండా చూసే ఉంటారు. నేను దూకుడు, భరత్‌ అనే నేను, మహర్షి ఇలా చాలా సినిమాలు చూశా. ఆయన ఎందుకు అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యరో ఆయన డెడికేషన్ చూసాక తెలిసింది.

నిజానికి తొలి రోజు నేను భయపడ్డాను. మహేష్‌ ఓ సూపర్‌ స్టార్‌. నేనింకా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. వాళ్ల మధ్య నేను ఇమడగలనో, లేదో అనుకున్నాను. కానీ ఆయనిచ్చిన ప్రోత్సాహంతో నా భయాలు, అనుమానాలు పటాపంచలైపోయాయి. ఇంక అందరితో కలిసిపోయి ఎటువంటి భయాలు లేకుండా నటించాను.

సినిమాలో నేను అలానే ఆయన్ని ఏడిపిస్తూ ఉంటానో సెట్లో కూడా అలానే టార్చర్‌ పెట్టాను. ఆయన్నే కాదు సెట్స్ లో ఉన్న అందరితో అలానే సరదాగా ఉన్నాను. నేనెప్పుడూ ఎక్కడా కుదురుగా ఉండలేను. ఎవరినో ఒకరిని ఏడిపిస్తూనే ఉంటాను. ఈ సెట్లోనూ అలానే అల్లరి చేశాను.

సాధారణంగా అనిల్‌ సర్‌కి స్క్రిప్ట్‌ మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఒక సీన్‌ అయిపోగానే, మరో సీన్‌కి వెంటనే షిఫ్ట్‌ అవుతారు. అలా క్లారిటీ ఉన్న దర్శకుడు, ఫాస్ట్‌గా పనిచేసే టీమ్‌ అంతకుమించి సూపర్‌స్టార్ మహేష్ గారి డెడికేషన్ ఉండటం వల్ల షూటింగ్‌ ఎంత ఫాస్ట్ గా అయిందో నాకే తెలియకుండా అయిపోయింది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు హీరోగా త్వరలో తెరకెక్కనున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే ఈ మూవీకి చెందిన టైటిల్ పోస్టర్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్, టాటూ హెయిర్ స్టైల్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Share

Leave a Comment