రికార్డ్ బ్రేకర్స్…

ఘట్టమనేని వారసుడు, టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు డేరింగ్ ఆండ్ డాషింగ్ హీరో గా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఆల్ఇండియా వైడ్ విస్తరించడమే కాకుండా అప్పటివరకు ఎవరి ఊహకి కూడా అందని అరుదైన రికార్డులను స్రుష్టిస్తూ తన క్రేజ్ ఎంటే తెలియజేసాడు. తన కలక్షన్ రికార్డ్ లను తానే బీట్ చేస్తూ నంబర్ వన్ సింహాసనం ఫై ధీమా గా కూర్చొని ఉన్నారు.

రాజకుమారుడు (1999) చిత్రంలో రాజాగా కనిపించి అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారారు. కె రాఘవేంద్ర రావు దర్శకత్వం లో వచ్చిన ఈ మూవీ విజయాన్ని సాధించింది. తొలి సినిమా తోనే కమర్షియల్ హీరో అనిపించుకున్నారు. తెలుగు ఇండస్ట్రీ లో ప్రిన్స్ అనే టైటిల్ కి పర్ఫెక్ట్ గా సుట్ అయ్యాడు.

మురారి (2001) తో ఫ్యామిలీ మొత్తాన్ని మహేష్ తన అభిమానులుగా చేసుకున్నాడు. ఈ మూవీలో మహేష్ అన్ని రకాల షేడ్స్ ని చూపించారు. సెంటిమెంట్ సీన్ లలో చక్కగా నటించి .. రాబోయే కాలంలో తనదే నంబర్ వన్ స్థానం అని సూచించారు. ఈ చిత్రంతో అటు విమర్శకులని సైతం మెస్మరైజ్ చేసాడు.

ఒక్కడు (2003) తో కలక్షన్ల వర్షం కురిపించారు. కబడ్డీ ప్లేయర్ గా, లవర్ ని సొంతం చేసుకునే యువకుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అద్భుతమైన కలేక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. దీంతో అప్పటి వరకు ఉన్న రికార్డ్ లు చెరిగిపోయాయి. ప్రిన్స్ తొలి సారి నంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు.

అతడు (2005) తో ఒక కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. నంద గోపాల్, పార్ధు గా మహేష్ నటనను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేక పోయారు. పక్కా ప్రొఫిషనల్ కిల్లర్ గా రికార్డులన్నింటినీ మర్డర్ చేశారు. ఇప్పటికీ ఈ చిత్రం త్రివిక్రమ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

పోకిరి (2006) తో దిమ్మ తిరిగేలా చేశాడు. అండర్ కవర్ పోలీస్ గా మహేష్ చేసిన యాక్షన్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తెలుగు సినిమాలు 50 కోట్ల మార్క్ ను దాటగలదని చూపించారు. 70 కోట్లు వసూల్ చేసిందని టాక్. పూరి జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన పోకిరి తెలుగు సినిమా ఇన్ని కోట్లు రాబట్ట గలదా? అని సినీ పండితులు ఆశ్చర్య పోయారు.

దూకుడు (2011) తో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, తండ్రికి మంచి కొడుకిగా ఆయన కోసం ఒక రాజకీయ నాయకుడుగా, మరో వైపు ప్రియుడిగా ఒకే సినిమాలో నాలుగు షేడ్స్ ని అద్భుతంగా పలికించారు. దీంతో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు దూసుకుపోయింది. ఈ చిత్రం తో భారీ వసూళ్లు రాబట్టి నంబర్ వన్ కుర్చీలో మహేష్ ధీమాగా సెటిల్ అయిపోయారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) తో తెలుగు లో మరలా మల్టీస్టారర్స్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. ఎటువంటి భేషజాలకు పోకుండా వెంకటేష్ తో కలిసి స్క్రీన్ ని పంచుని మళ్ళీ మల్టీస్టారర్స్ కు శ్రీకారం చుట్టారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చిన్నోడుగా సింపుల్ గా మన పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ మ్యాజిక్ చేసి కనక వర్షం కురిపించాడు.

శ్రీమంతుడు (2015) తో ఊరిని దత్తత తీసుకునే మంచి కాన్సెప్ట్ తో వచ్చి మహేష్ అభిమానులతో పాటు అందరిని ఆకట్టుకున్నాడు. అందుకే ఈ చిత్రం ఏకంగా రూ. 175 కోట్లు వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడుతో తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చూపించారు.

భరత్ అను నేను (2018) తో సినిమా అంటే కేవలం ఎంటర్‌టైన్మెంట్ ఒక్కటే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడే సాధనంగా నిరూపించి మనకి మన బాధ్యత ఎంటో తెలియజెప్పాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు రెండోసారి చేసిన మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

200 కోట్లకు పైగా వసూలు రాబట్టి రికార్డుల రారాజు మహేష్ బాబు అని మరోసారి నిరూపించింది. ఇక తన 25వ సినిమా మహర్షి(2019), 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు (2020) తో సంచలనమే సృష్టించాడు మహేష్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి.

ఒక గొప్ప సామాజిక అంశంతో తెరకెక్కిన మహర్షి సినిమాకి ఏకైంకా భారత ఉపరాష్ట్రపతి నుంచే ప్రశంసలు అందాయంటే మ్హ్ర్షి ప్ర్జల్లోకి ఎలా చేరువయ్యిందో మనకు తెలిసిపోతుంది. భారీ హిట్ తర్వాత భారీగానే అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు మించి అనిల్ రావిపూడి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా కొత్త రికార్డులని క్రియేట్ చేసింది.

Share

Leave a Comment