దుమ్ములేపిన భరత్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదటి నుండీ భరత్ అనే నేనుపై బజ్ ఉండటంతో భారీ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.

200 కోట్లకు పైగా భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా అటు తమిళంలో డబ్ చేస్తే అక్కడ కూడా భారీగానే వసూళ్లు దక్కాయి. భరత్ ఎన్నుమ్ నాన్ పేరుతో తమిళనాడులో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మొదటి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయి లో సుమారు ఒక కోటి రూపాయిలు వరకు గ్రాస్ వసూలు చేసినట్టు అక్కడ ట్రేడ్ పండిట్స్ తెలిపారు.

తాజాగా భరత్ అనే నేను హిందీ సాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయినట్లు తెలుస్తుంది. తెలుగు సినిమాల డబ్బింగ్ వెర్షన్లు వేరే భాషల్లో బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. థియేటర్లలో కంటే కూడా యూట్యూబ్‌ల్లో, అక్కడి టీవీ ఛానెళ్లలో తెలుగు డబ్బింగ్ సినిమాలు ఇరగాడేస్తున్నాయి.

ఉత్తరాదిన మన మాస్ సినిమాలకు ఊహించని స్థాయిలో ఆదరణ ఉంటోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వారు ఏకంగా 22 కోట్లకు ఈ హక్కులు దక్కించుకున్నారట. నిజానికి ఇది భారీ రేట్ అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ అంటే నార్త్‌లో కూడా పిచ్చ క్రేజ్. అందుకే భరత్ అనే నేను హిందీ శాటిలైట్ రైట్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఏ తెలుగు సినిమాకి ఇవ్వని స్థాయిలో భారీ ధరను చెల్లించారు.

బాహుబలి మినహా ఏ తెలుగు చిత్రానికి కూడా ఇంత ధర లభించలేదు. ‘బాహుబలి’ తర్వాత డబ్బింగ్ హక్కులకు అత్యధిక ధర దక్కించుకున్న తెలుగు సినిమాగా ‘భరత్ అనే నేను’ రికార్డు నెలకొల్పింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మహేష్ హిందీలో ఎంత పాపులర్ అంటే ఆయన గత చిత్రాలన్నిటికి కూడా ఆ చానెల్స్‌లో మంచి టి.ఆర్.పి లను సొంతం చేసుకున్నాయి.

భరత్ అనే నేను త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో అభిమానులకు కనువిందు చేయనుంది. జూన్ 9 నుంచి ఈ సినిమా తెలుగు వర్షన్ అమెజాన్ లో అందుబాటులో ఉండనుంది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో విడుదల చేసి వ్యూయర్ షిప్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెజాన్.

మహేష్ కెరీర్ లో 25వ చిత్రంగా రాబోతున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ నార్త్ ఇండియాలోని డెహ్రాడూన్ లో స్టార్ట్ అవుతుంది. సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లోను, మూడో షెడ్యూల్ అమెరికాలోను ఉంటుంది అని సమాచారం. ఏడాది క్రితమే కథని సిద్ధం చేసిన డైరక్టర్ వంశీ పైడిపల్లి ఇక ఈ చిత్రాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్తాడో చూడాలి.

Share

Leave a Comment