ఖచ్చితంగా మహేషే అంటున్న

అందంతో, అభినయంతో యూత్ కి గిలిగింతలు పెడుతూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న చెన్నై బ్యూటీ రెజీనా. కేవలం నటన ఒక్కటే కాకుండా అనేక సామజిక కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి మనసున్న తారగా పేరు తెచ్చుకుంది. మొన్నామధ్య పారా అథ్లెట్స్ కోసం వంద కిలోమీటర్లు సైక్లింగ్ చేసి, వారి వైద్యానికి కావల్సిన నిధులు సమకూరేలా చేసింది.

బ్లాక్‌బస్టర్ మూవీ శ్రీమంతుడు లో మహేష్ సైకిల్ తొక్కడం తనకి చాలా స్పూర్తి నిచ్చిందని చెప్పింది రెజీనా. ఇలా సమాజానికి తనవంతు సాయం చేయడం తనకి ఆనందాన్ని, సంతృప్తినిస్తుందని చెప్పుకొచ్చింది రెజీనా. స్వతహాగా మహేష్ ని ఎక్కువగా ఇష్టపడే రెజీనా ఇలాంటి విషయాల్లో కూడా మహేష్ ని ఆదర్శంగా తీసుకుంటుంది.

అంతే కాదు తెలుగులో చాలా మంది నచ్చిన హీరోలు ఉన్నారు. వారందరిలో నుంచి ఒకరిని చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా అది సూపర్ స్టార్ మహేష్ బాబు. ఫెంటాస్టిక్ పెర్ఫామర్ ఆండ్ యునీక్ స్టయిల్ ఆయన సొంతం. ఆయన సినిమాలన్ని చూస్తానని తెలిపింది. ఇప్పుడే కాదు ఇంతక ముందు కూడా చాలా సందర్భాలలో మహేష్ మీద తనకున్న అభిమానాన్ని వెల్లడించారు.

ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్న నా కల ఎప్పుడు నెరవేరుతుందో ఏమో అంటూ తన రెండవ సినిమా (రొటీన్ లవ్ స్టొరీ) ఇంటర్వ్యూలోనే చెప్పడం విశేషం. మంచి సినిమాలు చేస్తూనే త్వరలో ఇలాంటి కార్యక్రమాలకి మరింత సమయాన్ని కేటాయిస్తానని తెలిపింది.

ప్రస్తుత స్టార్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మహేష్ అంటే అందరికీ అభిమానమే. ఆయకున్న మహిళా అభిమానులైతే మరీ ఎక్కువ. దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచుకున్న ప్రాంతీయ భాష స్టార్ ఎవరైన ఉన్నారంటే అది కేవలం మన సూపర్ స్టార్ మహేష్ బాబు.

వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా “మహర్షి” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్‌ బాబు కిది 25వ చిత్రం కావడంతో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందించడమే కాకుండా సబ్జెక్ట్ విషయంలోనూ ఫ్రెష్ నెస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కథపై నమ్మకంతో తీస్తున్న మహర్షి పై బోలెడు అంచనాలున్నాయి.

Share

Leave a Comment