హాలీవుడ్ సినిమాల్లోనే

అందంతో, అభినయంతో యూత్ కి గిలిగింతలు పెడుతూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న చెన్నై బ్యూటీ రెజీనా. ఒక ద‌శ‌లో వ‌రుస హిట్ల‌తో మంచి ఊపుమీద క‌నిపించిన ఈ అమ్మాయి అందం, అభిన‌యం రెంటితోనూ మెప్పించింది. అనేక సామజిక కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి మనసున్న తారగా పేరు తెచ్చుకున్నారు రెజీనా.

వ‌రుస ఫ్లాపులతో రేసులో వెనుక‌బ‌డిపోయిన రెజీనా అదిరిపోయే సినిమా, క్యారెక్ట‌ర్, పెర్ఫామెన్స్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు రెజీనా. ఆ సినిమానే ఎవ‌రు. ఈ చిత్రంలో హీరో అడివి శేష్‌తో పాటు న‌వీన్ చంద్ర కూడా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు. వాళ్ల పాత్ర‌లూ బాగా పేలాయి. కానీ సినిమాలో ఎవ‌రిది బెస్ట్ క్యారెక్ట‌ర్, పెర్ఫామెన్స్ అంటే మాత్రం మ‌రో మాట లేకుండా రెజీనా పేరు చెప్పేయొచ్చు.

మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం హిట్ దిశ‌గా అడుగులేస్తోంది. దీంతో సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించారు రెజీనా. సినిమా విషయాలతో పాటు తనకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో మరోసారి తెలిపారు రెజీనా. నేను తెలుగు సినిమాలు చేయకుముంది నాకు ఇక్కడ యాక్టర్స్ గురించి జీరో నాలెడ్జ్ ఉండేది.

మా అమ్మ తెలుగు సినిమాలు చూస్తూ ఉంటే మనకు అర్ధం కావు ఎందుకు మార్చెయ్ అంటుండే దాన్ని. ఇది ఎప్పుడో 2010 కి ముందు మాట. కానీ ఆ టైమ్ లో నాకు తెలుగు నుంచి తెలిసిన యాక్టర్స్ మహేష్ బాబు, చిరంజీవి మాత్రమే. నేను మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్. ఆయనను స్క్రీన్ మీద చూడడం అంటే నాకు చాలా ఇష్టం.

ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. చాలా సబ్టిల్ గా ఉంటుంది ఆయన యాక్టింగ్. కేవలం హాలీవుడ్ సినిమాల్లోనే అలాంటి యాక్టింగ్ చూస్తాం. మన ఇండియన్ సినిమాల్లో గట్టి గట్టిగా డైలాగ్స్ చెప్తూ, ఎమోషన్స్ ను చూపిస్తూ ఉంటాం. కానీ మహేష్ గారు డైలాగ్ చెప్పేటప్పుడు చాలా సబ్టిల్ గా హాలీవుడ్ స్టైల్ లో ఉంటుంది.

మహేష్ ఒక విలన్ కు వార్నింగ్ ఇచ్చే సీన్ అయినా చూడండి, ఆయన డైలాగ్ డెలివరీని చేంగ్ చేస్తారు. డైలాగ్ తో పాటు బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ కూడా మారుస్తారు. మహేష్ గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు రెజీనా. ఎవరు సినిమాకు ప్రేక్షకుల నుండి వస్తోన్న రెస్పాన్స్ సూపర్బ్. నేను సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్లినప్పుడు సీట్ ఎడ్జ్ మూవీలో ప్రేక్షకులు ఎలా ఉంటారా అని దగ్గర నుండి చూశాను.

అలాగే సినిమాలోని ట్విస్టులకు ఎగ్జయిట్ అయిన కొంతమంది ప్రేక్షకులు క్లైమాక్స్ విజువల్స్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ సినిమాలోని ట్విస్ట్‌ను రివీల్ చేస్తున్నారు. ప్లీజ్ అలా చేయకండి. ఈ సినిమాకు క్లైమాక్స్ చాలా కీలకం. ఆ సీక్రెట్‌ను సినిమా చూసిన ప్రేక్షకులు బయట పెట్టకండి అని రిక్వెస్ట్ చేశారు. ఎవరు సినిమా తరువాత రెజీనాకు క్రేజ్ పెరిగింది. అటు తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నట్టు తెలిపారు రెజీనా.

మహర్షి సినిమాతో మాంచి ఊపు మీదున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దుమ్మురేపే కలెక్షన్లతో పాటు ప్రముఖుల ప్రశంసలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

గత రెండు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ ఈ సారి మాత్రం త్వరగానే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయారు. ఇందుకోసం మహర్షి సెట్స్ పైన ఉండగానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన కథానాయిక.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.

Share

Leave a Comment