రాక్ స్టార్ స్పెషల్ ట్రిబ్యూట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి బాక్సాఫీస్ దగ్గర లెక్కలు మార్చే పనిలో బిజీగా ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై నెల రోజులు కావస్తున్నా సరే ఇంకా పలు చోట్ల స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతూ హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఈ ఏడాది మ‌హ‌ర్షి వంటి సెన్సేష‌న‌ల్ హిట్‌కు సంగీతాన్ని అందించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యారు రాక్‌స్టార్ డి.ఎస్‌.పి. `మ‌హ‌ర్షి` సూప‌ర్ స్టార్ మహేష్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్ మూవీయే కాదు..ఆయ‌న సిల్వ‌ర్ జూబ్లీ మూవీ కూడా కావ‌డం విశేషం. అభిమానులు మ‌హ‌ర్షి సినిమా కోసం ఎంత అతృత‌గా ఎదురు చూశార‌న‌డానికి ఆ సినిమా సాధించిన స‌క్సెసే రుజువుగా నిలిచింది.

ఈ సినిమా ప్రారంభం నుండి విడుద‌ల వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను క్యారీ చేయ‌డంలో దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం కీల‌క భూమిక పోషించింది. రైతు కోసం పోరాడే క‌థానాయ‌కుడి ఫీల్‌ను త‌న సంగీతంతో ప్రేక్ష‌కుడి గుండెకు హ‌త్తుకునేలా చేయ‌డం దేవిశ్రీకే చెల్లింద‌నాలి. ఇక సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.

సినిమా కంటెంట్‌, సోల్‌, ఎమోష‌న్‌ను చివ‌రి వ‌ర‌కు ఆడియన్ క‌ట్టిప‌డేసేలా చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు డి.ఎస్‌.పి. సినిమాకు ప‌నిచేసే శాఖ‌ల‌న్నీ వాటి ప‌నుల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించాల‌నే విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. అప్పుడే ఓ సినిమాకు ప‌రిపూర్ణ విజ‌యం సాధ్య‌మ‌వుతుంది.

అయితే ద‌ర్శ‌కుడు త‌న చెప్పాల‌నుకున్న ఫీల్‌ను ఆడియ‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా చేసేది మాత్రం సంగీతం.. ముఖ్యంగా మ‌హ‌ర్షి బ్యాగ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్‌లో నిలిచింది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, రాక్‌స్టార్‌పై పూర్తి భ‌రోసాతో ఇచ్చిన స్వేచ్ఛ‌ను .. అందుకు వ‌చ్చిన రిజ‌ల్టే సోదాహ‌ర‌ణంగా నిలిచింది.

మ‌హ‌ర్షి విజ‌యంలో చాలా పెద్ద పాత్ర‌ను పోషించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ …“ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన `మ‌హ‌ర్షి` విడుద‌లై నెల‌రోజుల‌వుతుంది. ఇంత‌టి గొప్ప విజ‌యాన్ని అందించి, అంద‌మైన అనుభూతిని మిగిల్చిన ప్ర‌తి ఆడియ‌న్‌కు మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇంత మంచి సినిమాలో న‌న్ను భాగం చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నిర్మాత‌లు దిల్‌రాజు, అశ్వ‌నీద‌త్‌గారు, పివిపిగారికి థాంక్స్‌. నా సంగీతంపై మ‌హేష్‌గారు చూపే ఆద‌ర‌ణ‌, న‌మ్మ‌కానికి ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.

అలాగే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌గారి త‌దుప‌రి చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి కూడా వ‌ర్క్ చేసే అవ‌కాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకు నేను ఇంత మంచి సంగీతం అందించానంటే కార‌ణం నా టీం. నాతో పాటు వ‌ర్క్ చేసిన టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నేది చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.

ఇంత మంచి ఆల్బ‌మ్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ రావ‌డానికి కార‌ణ‌మైన ఈ టెక్నీషియ‌న్స్‌కు ట్రిబ్యూట్‌గా ఓ వీడియో విడుద‌ల చేస్తున్నాను. ఈ వీడియోలో సినిమా మ్యూజిక్‌లో పార్ట్ అయిన టెక్నీషియ‌న్స్ అందరినీ చూపిస్తున్నాం. ప్రేక్ష‌కులు ఇలాగే వారి అభిమానాన్ని, ప్రేమ‌ను నాపై చూపిస్తూ ఉండాల‌ని కోరుకుంటున్నాను. థాంక్యూ…” అన్నారు.

ఫారెన్ టూర్ లో ఉన్న మహేష్ ఇండియా వచ్చిన వెంటనే ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగులో జాయిన్ కాబోతున్నారు. ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని, అనిల్ రావిపూడి సినిమాల తరహాలో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్. ఈ చిత్రానికి కూడా దేవీ నే సంగీతం అందించనున్నడం విశేషం.

ఈ సారి మాత్రం ఎక్కడ పార్టీ జరిగినా ఈ పాట పెట్టాల్సిందే అనేట్టుగా ఓ మాస్‌ బీట్‌ను కంపోజ్‌ చేస్తా అని అభిమానులకి ప్రామిస్ కూడ చేసేసారు దేవి. దీంతో ఈ సినిమా మ్యూజిక్ మీద ఇప్పుడు అందరి అంచనాలు ఒకేసారి పెరిగిపోయాయి. రాక్‌స్టార్ దేవి తన మాట నిలబెట్టుకుని మహేష్ అభిమానులకి జీవితాంతం గుర్తుండిపోయే పాటలు ఇస్తాడని ఆశిద్దాం..

Share

Leave a Comment