అవకాశం కోసం వెయిటింగ్

రీజనల్ బౌండరీలని చెరిపేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ పాపులారిటీ తో పాటు స్ట్రాంగ్ ఫాన్ బేస్ ని ఏర్పరుచుకున్న ఒకే ఒక తెలుగు హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు. ఓవర్సీస్ లో అందరి కంటే ముందు మార్కెట్ సంపాదించుకున్నది అతనే. అతడి ముందు ఏ హీరో అయినా దిగదుడుపే. ఫ్లాప్ సినిమాలతోనూ మిలియన్ డాలర్లు కొల్లగొట్టగలడు.

మహేష్‌ ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంచి ఫాలోయింగి ఉంది. అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు.

ఇప్పుడు ఆ జాబితా లోకి తమిళ నటి సాయి ధన్సిక కూడా చేరారు. కబాలి మూవీలో రజనీకాంత్ సరసన నటించిన ధన్సిక ఇప్పటికే మంచి నటి అనే పేరు ని తెచ్చుకున్నారు. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకు ఎక్కువగా ఇష్టపడే ఈమె మహేష్ గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశంసించారు.

మహేష్ బాబు అంటే తనకి ఎంతో ఇష్టమని ఆయన టాల్, హ్యాండ్సమ్ గా చూడముచ్చటగా ఉండటమే కాకుండా అద్భుతంగా నటిస్తారు అని తెలిపారు ధన్సిక. ఆయనికి నేను చాలా పెద్ద ఫ్యాన్ ని అని, ఆయన సినిమలని ఫాలో అవుతాను అని తెలిపారు ధన్సిక.

ఆయనతో నటించాలని ఉంది అని, ఆ చాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను, ఆయన నటన ఎంతో నాచురల్ గా ఉంటుందని అదే మహేష్ ని అందరిలో స్పెషల్ గా నిలబెట్టింది అని మహేష్ మీద తనకున్న అభిమానాన్ని వెల్లడించి ఫ్యాన్స్ అందరికి ఇలా సడన్ సర్ప్రైస్ ఇచ్చారు ధన్సిక. మహేష్ కి నేషనల్ లెవెల్ లొ ఉన్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడు వచ్చే నూతన నటీమనుల నుంచి వేరే భాష లో నటిస్తున్న అగ్ర హీరోయిన్స్ వరకు అందరికి మన టాలివూడ్ లో సుపరిచితమైన పేరు మహేష్ బాబు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ‘మహర్షి’. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. అశ్వినీదత్, దిల్‌ రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. రిషి పాత్రలో మహేష్, రవి పాత్రలో ‘అల్లరి’ నరేష్ కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయింది. ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ అక్టోబర్‌ 15న న్యూయార్క్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం.

Share

Leave a Comment