మహేష్ మెసేజ్‌కు అదితి థ్రిల్

సుధీర్ బాబు, అదితి రావు జంటగా నటించిన ‘సమ్మోహనం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టీజర్, ట్రైలర్స్ లో ఈ చిత్రంలోని ప్రెష్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్ చేశారు.’ఇండస్ట్రీ నుండి సమ్మోహనం చిత్రం గురించి మంచి రిపోర్ట్స్ వింటున్నాను. ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్స్ , సూతింగ్ మ్యూజిక్, సరికొత్త కాన్సెప్ట్ అలాగే సుధీర్ బాబు, అతిధి రావు ల నటన బాగున్నాయి అంటున్నారు .

సమ్మోహనం చిత్ర టీం కు మరియు నటీనటులకు నా బెస్ట్ విషెస్’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మహేష్ బాబు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ ముఖ్య అతిధిగా హాజరైన విషయం తెలిసిందే. మరి తాజా ట్వీట్ తో అయన ఈ చిత్రం ఫై వున్న అంచనాలను పెంచేశారు.

సూపర్ స్టార్ ట్వీట్ కు సుధీర్ బాబు, అదితి రావు వెంటనే తమ ట్వీట్ల ద్వారా స్పందించారు. ‘ థాంక్స్ మహేష్, చాలా విషయాలకు నువ్వే ఇన్స్పిరేషన్. నీ సపోర్ట్ అంటే చాలా పెద్ద విషయం. మా టీం అంతా 100% ఇచ్చాం. రేపు ప్రేక్షకులు కూడా థియేటర్లలో ఇష్టపడతారని ఆశిస్తున్నాను’ అంటూ సుధీర్ బాబు ట్వీట్ చేశారు.

‘థాంక్యూ సో మచ్ మహేష్. థ్రిల్డ్ టు హియర్ దిస్ ఫ్రం యు’ అంటూ అదితి రావు ట్వీట్ చేశారు. ‘థాంక్యూ సో మచ్ మహేష్ గారు, దిస్ ఈజ్ వెరీ గ్రేషియస్ ఆఫ్ యు’ అంటూ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ట్వీట్ చేశారు.

సుధీర్ బాబు కెరీర్ కు సమ్మోహనం చిత్రం చాలా కీలకం. విడుదలకు ముందే సమ్మోహనం చిత్రం పాజిటివ్ బజ్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. యుఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోలు అయిపోయి మంచి టాక్ ను తెచ్చుకుంది. సుధీర్ బాబు, అదితిల సమ్మోహనం ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో వేచి చూడాలి.

Share

Leave a Comment