మహేష్ గురించి సందీప్ కిషన్

స్టార్‌ వ్యాల్యూ ఇండస్ట్రీలో వినిపించే మాట. ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధమ స్థానం లో ఉంటారు. అతని క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

సామన్య ప్రేక్షకుల్లోనే కాకుండా ఇండస్ట్రీ లో కూడా ఆయనకు మామూలు ఫాలోయింగ్ లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సూపర్ స్టార్ మహేష్ బాబుని మనసారా అభినందించారు సందీప్ కిషన్. అంతే కాకుండా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ని మెచ్చుకుంటూ తనకి మహేష్ అంటే ఎంత ఇష్టమో వివరించారు సందీప్ కిషన్.

ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఎప్పటికప్పుడు కొత్త తరహా కథల కోసం ఆయన పడే తాపత్రయం చాలా గొప్పది అని సందీప్ కిషన్ కొనియాడారు. ఆయన ఇంటర్వ్యూ లో మహేష్ గురించి చెప్పిన విశేషాలు మీకోసం క్లుప్తంగా. ‘చాలా మంది మహేష్ గారిని అన్నారు స్పైడర్ తరువాత ఎందుకు బైలింగువల్ చేసారు అని. ఆయన చాలా గ్రేట్ అండీ, లేదంటే ఆయన స్టార్‌డంకి సింపుల్ గా ఒక కమర్షియల్ సినిమా చేసుకుని వెల్లిపోవచ్చు.

ఆయన ఉన్న పొసీషన్ కి ఇప్పటికీ ఒక కొత్త కథ చేయాలి, మంచి ప్రయత్నం చేయాలి అని ఆయన ప్రాణం పెడుతున్నారు. దురద్రుష్టవసాత్తు అవి అనుకున్నంత క్లిక్ అయ్యుండక పోవచ్చు. కాని ఆయన పెట్టే ఎఫొర్ట్ చాలా జెన్యూన్ అండి, తప్పకుండా ఆయన్ని అభినందించాలి.

చాలా అధ్బుతమైన విషయం అది. ఆయన స్థాయి కి ఆయన ఇలాంటివి ఎందుకు చెయాలి. ఆయన ఎమైనా చేసుకోవచ్చు కదా, యే దర్శకుడు కావలంటే వాళ్లు వస్తారు కదా. ఎలాంటి సినిమా అంటే అలాంటి సినిమా తీసుకొవచ్చు కదా, అయినా కుడా ఆయన కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఒక నేనొక్కడినే అయినా, ఒక బ్రహ్మోత్సవం అయినా, స్పైడర్ అయినా ఇలా అన్ని కొత్తగా ప్రయత్నిస్తున్నారు. కొన్ని కనెక్ట్ అవ్వలేదు అంతే. కాని ఆయన పెట్టిన ఎఫోర్ట్స్ ని తప్పకుండా అభినందించి తీరాలి. ఇలాంటి కొత్త ప్రయత్నాలు చేయడం లో మహేష్ గారు మొదటి వరుస లో ఉంటారు” అని కొనియాడారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ చిత్రం డెహ్రాడూన్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకుంది. తాజాగా ఈ షెడ్యూల్ ముగిసింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు.

Share

Leave a Comment