అందులో సూపర్‌స్టార్ ప్రధమ స్థానం

ఒక ఇంటెర్వ్యూ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మనసారా అభినందించారు అంతే కాకుండా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ని మెచ్చుకుంటూ తనకి మహేష్ అంటే ఎంత ఇష్టమో వివరించాడు సందీప్ కిషన్.

స్టార్‌ వ్యాల్యూ…ఇండస్ట్రీలో వినిపించే మాట. ఓ అగ్ర నటుడు తన అభినయంతో కథను మరో స్థాయికి తీసుకెళ్లడం అరుదుగా జరుగుతుంటుంది. అందులో సూపర్ స్టార్ ప్రధమ స్థానం లో ఉంటారు. వ్యాపారంలో అతని క్రేజ్‌ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది.

ఒక సూపర్ స్టార్ అయి ఉండి ఎప్పటికప్పుడు కొత్త తరహా కథ ల కోసం ఆయన పడే తాపత్రయం చాలా గొప్పది అని సందీప్ కిషన్ కొనియాడారు. ఆయన ఇంటర్వ్యూ లో మహేష్ గురించి చెప్పిన విశేషాలు మీకోసం క్లుప్తంగా ..

“మహేష్ గారిని చాల మంది అన్నారు స్పైడర్ తరువాత, ఎందుకు బైలింగువల్ చేసారు అని..ఆయన చాల గ్రేట్ అండీ, లేదంటే ఆయన కమర్షియాలిటి కి సింపుల్ గ ఆయన ఒక కమర్షియల్ సినిమా చేసుకుని వెల్లిపోవచ్చు.

ఆయన ఉన్న పొసీషన్ కి ఇప్పటికీ ఒక కొత్త కథ చేయాలి, మంచి ప్రయత్నం చేయాలి అని ఆయన ప్రాణం పెడుతున్నారు. దురద్రుష్టవ సాత్తు అవి క్లిక్ అయ్యుండక పోవచ్చు అనుకున్నంత. కాని ఆయన పెట్టే ఎఫొర్ట్ చాలా జెన్యూన్ అండి, తప్పకుండా ఆయన్ని అభినందించాలి.

చాలా అధ్బుతమైన విషయం అది. ఆయన స్థాయి కి ఆయన ఇలాంటివి ఎందుకు చెయాలి. ఆయన ఎమైనా చేసుకోవచ్చు కదా, యే దర్శకుడు కావలంటె వాళ్లు వస్తారు కదా. ఎలాంటి సినిమా అంటే అలాంటి సినిమా తీసుకొవచ్చు కదా, అయినా కుడా ఆయన కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఒక నేనొక్కడినే అయినా, ఒక బ్రహ్మోత్సవం అయినా, స్పైడర్ అయినా .. ఇలా అన్ని కొత్తగా ప్రయత్నిస్తున్నారు.. కొన్ని కనెక్ట్ అవ్వలేదు అంతే. కాని ఆయన పెట్టిన ఎఫోర్ట్స్ ని తప్పకుండా అభినందించి తీరాలి. ఇలాంటి కొత్త ప్రయత్నాలు చేయడం లో మహేష్ గారు మొదటి వరుస లో ఉంటారు.” అని కొనియాడాడు.

తరువాత మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. మహేష్ చేస్తున్న 25వ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్‌ను జూన్ లో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ చిత్రంలో ప్రత్యేక లుక్‌ కోసం కసరత్తులు చేయనున్నారు మహేష్‌

Share

Leave a Comment