క్లారిటీ ఇచ్చిన సందీప్

టాలీవుడ్లో అర్జున్ రెడ్డి తో, బాలీవుడ్లో కబీర్ సింగ్ తో సంచలన విజయాలని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఫిలిమ్ మేకర్స్ లో ఒకరు. ఈ చిత్రాల పై క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చినా సందీప్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులతో సహా స్టార్ హీరోలు సైతం ఫిదా అయిపోయారు.

ఎప్పుడో అర్జున్ రెడ్డి టైమ్ లోనే తాను సూపర్‌స్టార్ మహేష్ కోసం ఒక కథ రాసుకొన్నాని, పాయింట్ మహేష్ కి నచ్చిందని, త్వరలోనే పూర్తి కథను కూడా ఆయనకు చెప్పనున్నానని స్వయంగా సందీప్ రెడ్డి వంగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే మహేష్ బాబు తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కారణంగా సందీప్ రెడ్డి వంగా సినిమా చేయలేక పోయారని, ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని చెప్పుకొన్నారు. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సందీప్ రెడ్డి- మహేష్ కాంబోలో సినిమా రావడం పక్కా అని తెలుస్తోంది.

కబీర్ సింగ్ సక్సెస్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ రెడ్డి.. హీరో మహేష్ బాబు తో తను తదుపరి సినిమా పై స్పష్టత ఇచ్చారు. త్వరలో తాను మహేష్ బాబు తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహేష్ బాబు కి స్టోరీ లైన్ చెప్పానని, ప్రస్తుతం దాని పై వర్క్ ప్రారంభించానని చెప్పారు.

ప్రస్తుతం ఆ కాన్సెప్ట్ కి సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ పనులు ఎండ్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతూ త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. సందీప్ రెడ్డి ముందుగా చెప్పినట్లుగా ఇది వైవిధ్యమైన సినిమానా లేక కమర్షియల్ సినిమా అనేది తెలియాలంటే మాత్రం కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమా హిందీ లో ఉంటుందా లేక తెలుగులో ఉంటుందా ని యాంకర్ అడిగిన్ ప్రశ్న కు తాను ఇంక ఏమీ అనుకోలేదు స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యాక దాని గురించి ఆలోచిద్దాం.. ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాను. ఇక తన ద్రుష్టి మొత్తం నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పెట్టనున్నాను అని సందీప్ తెలిపారు.

సినిమాలు గొప్పగా ఉంటే భాషలు అనేవి ఒక మ్యాటర్ కాదనే విషయాన్ని బాహుబలి మరియు కేజీఎఫ్ చిత్రాలు నిరూపించాయి. ప్రేక్షకులు మంచి కంటెంట్ తో సినిమా తీస్తే బాషతో సంబంధం లేకుండా చూసేస్తున్నారు. అందుకే తాను కూడా అలాంటి సినిమాలను తీసి అన్ని భాషల ప్రేక్షకులను నచ్చే విధంగా చేయాలనే పట్టుదలతో ఉన్నాడట.

సందీప్ వంగ పూర్తి కథ రెడీ చేసి మహేష్ ని మెప్పిస్తే క్రేజీ కాంబినేషన్ కు రంగం సిద్ధం అయినట్లే. సూపర్ స్టార్ స్టార్ పవర్ కి సందీప్ యాటిట్యూడ్ తోడయ్యితే ఆ సినిమాకు ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో చెప్పడం కష్టం. ఇప్పుడు వీరి కాంబినేషన్ గురించే సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది.

ఇక మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో మహేష్ ఆర్మీ మేజర్‌ పాత్ర చేస్తున్నారు. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది.

తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది. కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా.. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. అలాగే జ‌గ‌ప‌తి బాబు గారు కూడా మంచి ప్రాత‌లో న‌టిస్తున్నారు.

స‌రిలేరు నీకెవ్వ‌రు పై భారీ ఎక్స్ పెక్టేష‌న్సే ఏర్పాడ్డాయి. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ జెమినీ టివి భారీ సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా పై భారీ బిజినెస్ జరగడం తథ్యం అని ఇప్పటికే ట్రేడ్ లోనూ చర్చ సాగుతోంది

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు చాలా కాంఫిడెన్స్ తో ఉన్నారు.

Share

Leave a Comment