అలా ఆటపట్టించేవారు..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు భార్య న‌మ్ర‌త గ‌తంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. వంశీ సినిమా షూటింగ్ స‌మ‌యంలో మ‌హేష్‌, న‌మ్ర‌త ప్రేమ‌లో ప‌డి ఆ త‌ర్వాత వివాహం చేసుకున్నారు. మ‌హేష్‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మై కుటంబానికే న‌మ్ర‌త అంకిత‌మైపోయారు.

వాస్తవ్‌ సినిమా సెట్‌లో బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ తనను ఆటపట్టించేవారని నమ్రత గుర్తు చేసుకున్నారు. ఆమె తన స్నేహితుడు సంజయ్ దత్ కు 60 ఏళ్లా? కాలం చాలా వేగంగా పరుగులు తీస్తోంది. ఒకప్పుడు సంజు చిన్నపిల్లాడిలా ప్రవర్తించేవారు. అతడి స్వభావం నాకు నచ్చేది.

నాకు ఇష్టమైన సహనటుల్లో అతడు ఒకరు. నేను, మహేష్ ప్రేమలో ఉన్నామని ముందు సంజయ్‌కే చెప్పా. మా విషయం తెలిసిన మొదటి వ్యక్తి అతడే. నేను చెప్పగానే చిన్నపిల్లాడిలా చాలా సంతోషించారు. యూనిట్‌ సభ్యుల ముందు మహేష్ గురించి అడుగుతూ తెగ ఆటపట్టించేవారు.

ఉదయం 9 గంటలకు షూటింగ్‌ ప్రారంభమైతే సాయంత్రం 6 గంటలకు ముగిసేది. ఎక్కువ మంది జనాల మధ్య షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సంజయ్‌ నన్ను, నా సహనటీమణుల్ని ఓ కంటకనిపెడుతూ ఉండేవారు. జనాలు మా దగ్గరకి రాకుండా చూసుకునేవారు.

నన్నే కాదు సంజయ్‌ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరి సంరక్షణను బాధ్యతగా ఫీల్‌ అయ్యేవారు. కానీ కొందరు సంజయ్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని నమ్రత చెప్పారు. నమ్రత 1998లో బాలీవుడ్‌కు నటిగా పరిచయం అయ్యారు. తర్వాత అనేక సినిమాల్లో నటించిన ఆమె 2000లో వంశీ చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించారు.

ఆ తర్వాత మళ్లీ వరుసగా హిందీ చిత్రాలతో బిజీ అయ్యారు. వంశీ చిత్రం షూటింగ్‌ సమయంలో మహేష్ బాబు, నమ్రతల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహ బందం ప్రేమగా మారింది. 2005లో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అప్పటి నుంచి నమ్రత నటనకు దూరంగా ఉన్నారు. మహేష్ ను పెళ్లి చేసుకోవడానికి నా కెరీర్‌ను సంతోషంగా వదిలేశా అని ఆమె అన్నారు. ఆద‌ర్శ దంప‌తులు అంటే ఎలా ఉంటారో మ‌హేష్ బాబు, న‌మ్ర‌తలను చూస్తే అర్థ‌మ‌వుతుందంటూ సినీ ప్రేక్షకులు చెపుతూ ఉంటారు.

పెళ్లై 14 ఏళ్ళైపోయినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి వివాదాల జోలికి పోకుండా హాయిగా ఉన్నారు ఈ జంట‌. టాలివుడ్ లో ధి బెస్ట్ కపుల్ గా నిలిచారు. త‌న భార్య న‌మ్ర‌త గురించి ఇటీవల జాతీయ మీడియాతో మ‌న‌సులో మాట బ‌య‌టికి చెప్పారు సూప‌ర్ స్టార్.

ఆమె లేకుండా నేను లేన‌ని చెప్పి నమ్రత అంటే తనకు ఎంత అభిమానమో చెప్పేసారు మ‌హేష్ బాబు. తాను ఈ రోజు ఇంత హాయిగా ఉన్నానంటే ఎలాంటి టెన్ష‌న్ లేకుండా సినిమాలు చేసుకుంటున్నానంటే దానికి కార‌ణం న‌మ్ర‌త అని చెప్పారు మ‌హేష్ బాబు. త‌న టెన్ష‌న్స్ అన్నీ ఆమె తీసుకుంటుంద‌ని, ప్ర‌తీ విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తుంద‌ని చెప్పారు.

సినిమాల విష‌యంలో కానీ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యంలో కానీ అన్నింట్లోనూ న‌మ్ర‌త పాత్ర కీల‌క‌మే అంటున్నారు మ‌హేష్. త‌న చెంత‌కు ఎలాంటి టెన్ష‌న్స్ రాకుండా ప్ర‌శాంతంగా ఉండ‌టానికి త‌న కుటుంబ‌మే కార‌ణం అన్నారు మ‌హేష్. నా భార్య నమ్రత నా చుట్టూ ఉంటే చాలు.

దేని గురించీ నేను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె నాకు నిజమైన విమర్శకురాలు. మంచి సలహాలు కూడా ఇస్తుంది అని చెప్పారు. సినిమా విడుద‌ల రోజు కూడా నేను ఒత్త‌డికి లోన‌వ‌కుండా నా భార్య జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. పిల్లలు గౌతమ్, సితారలను నేను గారాబం చేస్తాను.

నమ్రత మాత్రం చాలా స్ట్రిక్ట్‌. పిల్ల‌ల విష‌యంలోనే కాదు నా విష‌యంలోనూ క‌ఠినంగానే ఉంటుంది. అది కుటుంబానికి మంచిదే అనుకోవాలి. నా గారాబం వ‌ల్ల పిల్ల‌ల ఆలోచ‌నా ధోర‌ణి మార‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుందని మ‌హేష్ చెప్పారు.

Share

Leave a Comment