అదిరే లెవెల్లో..!!

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు సినిమా పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఒక వారం క్రితం వరకూ ప్రమోషన్స్ విషయంలో వెనకబడినట్లు అందరు అనుకున్న తరుణంలో ఒక్కసారిగా సరికొత్తగా ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. టీజర్ విడుదలతో ఒక్కసారిగా వారిలో ఫుల్ జోష్ వచ్చేసింది.

జస్ట్ అభిమానులే కాదు. సాధారణ ప్రేక్షకులలో కూడా ఈ సినిమా పై ఉన్న అంచనాలు డబల్ అయ్యాయి. మహేష్ పాత్ర.. యాక్షన్ సీన్స్.. ఆ పంచ్ డైలాగ్స్ చూస్తుంటే ఒక ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్ చూడబోతున్నామనే ఫీల్ కలిగింది. ఇక సోషల్ మీడియాలో టీజర్ జోష్ మామూలుగా లేదు. ఇప్పటికే 25 మిలియన్ల వ్యూస్ దాటేసింది.

హాఫ్ మిలియన్ లైక్స్ తో సంచలనం సృష్టిస్తోంది. ఇక నిర్మాతలైన ఎకే ఎంటర్టైన్మెంట్స్ టీమ్ కూడా టీజర్ పై కాంటెస్ట్ లు పెడుతూ ప్రేక్షకులు టీజర్ ను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఇలా టీజర్ లోని అంశాలపై 9 ప్రశ్నలు అడిగారు. ఎంతో మంది నెటిజన్లు ఈ ప్రశ్నలకు బదులిస్తూ టీజర్ పై ఆసక్తి కొనసాగేలా చేస్తున్నారు.

ఆ ప్రశ్నల పరంపరలో 9 వ పశ్నను గమనిస్తే “టీజర్ లో ఒక పక్షి క్యామియో ఉంది. దానికి అర్థం ఏంటి?” ఫ్యాన్స్ ను కాకుండా సాధారణ ప్రేక్షకులు ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేరు కానీ టీజర్ ను మరోసారి చూస్తే వెంటనే అర్థం అవుతుంది. టీజర్ లో 34 సెకెన్లకు ఒక పావురం కనిపిస్తుంది.

ఈ ప్రశ్నకు చాలామంది నెటిజన్లు ‘శాంతి.. స్వతంత్రం’ అంటూ బదులిచ్చారు. ఒకరేమో ‘విలన్ వల్ల శాంతి లేక ఎగిరిపోయింది’ అన్నారు. సరైన జవాబు ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది కానీ కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఈ ప్రమోషన్ కాన్సెప్ట్ ఇతర సినిమాల వారు కూడా త్వరలో అందిపుచ్చుకోవడం ఖాయం.

టీజర్ కు రెస్పాన్స్ రావడంతో దానిని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో… ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 2 వ తేదీన సోమవారం రోజున ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే, ఫస్ట్ సింగిల్ సాంగ్ ను ఏ సమయంలో రిలీజ్ కాబోతున్నది అన్నది తెలియాలి.

ఇక లిరికల్ వీడియో ల పరంగా ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. మహేష్‌ను మాస్‌ ఇమేజ్‌లో చూసి చాలా రోజులు అవుతుండటంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. మహేష్ కెరీర్ లో ఇది మరో బ్లాక్ బస్టర్ రికార్డుగా నిలవడంతో పాటు నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా ప్రేక్షకులు అంచనాలు పెంచేసుకుంటున్నారు.

ఈసారి పూర్తిగా కమర్షియల్‌ ఫార్ములాకి తగ్గట్టుగా ఎక్కడ ఏది వుండాలో అలా మీటర్‌లో వేస్తూ పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ని సిద్ధం చేస్తున్నాడు రావిపూడి. ఈ మూవీ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న దర్శకుడు ప్రత్యేక పాత్రలు అద్భుతంగా వచ్చేందుకు స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ద చూపించినట్టు టాక్.

వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మహేష్.. టాలీవుడ్‌లో టాప్‌ హీరోగా కీర్తించబడుతున్నారు. కాబట్టి ఆయన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి సోషల్ మీడియాలో టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సంక్రాంతికి అప్పుడే మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టు అనిపిస్తుంది.

అలాగే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని..మునుపెన్నడూ ఏ సినిమాకు లేని విధంగా అట్టహాసంగా ఈ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నట్లుగా సమాచారం. భారీ ఎత్తున అభిమానులతో పాటు పలువురు టాలీవుడ్ స్టార్స్ ను కూడా ఈ వేడుకలో భాగస్వామ్యం చేయాలని సరిలేరు నీకెవ్వరు టీం భావిస్తున్నారు.

Share

Leave a Comment