ప్రేక్షకులకు ఫుల్ మీల్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్లను మలచడంలో స్పెషలిస్ట్ అయిన అనిల్ రావిపూడి ఈ సినిమాతో మహేష్ కు మరో బ్లాక్ బస్టర్అందించడం ఖాయమని సినీ ప్రేమికులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

పెద్ద హీరోల సినిమాలు మేకింగ్ దశలో ఉన్నపుడు దర్శకులు పెద్దగా మాట్లాడరు. విశేషాలు పంచుకోవడానికి ఇష్టపడరు. సైలెంటుగా పని చేసుకుని పోతుంటారు. కానీ మహేష్ బాబుతో తొలిసారి జట్టు కట్టిన అనిల్ రావిపూడి మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ సనిమాపై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ సినిమా విశేషాలు పంచుకుంటూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నారు.

దసరా సందర్భంగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఒక మాస్ పోస్టర్‌తో మురిపించిన అనిల్ తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ అభిమాలకు మరింత ఆనందాన్నిచ్చే మాటలు చెప్పారు. ఈమధ్య నటించిన సినిమాల్లో మెసేజ్ ఎక్కువగా ఉంటోందని కామెడీ తగ్గుతోందని ఒక కామెంట్ వినిపిస్తోంది. మరి మీ స్టైల్ సినిమాలో మహేష్ ను చూసి చాలా రోజులయింది.

ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతోంది. మహేష్ సినిమాల్లో కామెడీ లోటును తీర్చబోతోందా? అని ప్రశ్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఈ సినిమాలో అందరి పాత్రలకు ప్రాధాన్యత ఉంది. విజయశాంతి గారు, ప్రకాష్ రాజ్ గారు, మహేష్ గారు అందరూ ఇరగదీశారు. ఈ మధ్యకాలంలో మహేష్ సినిమాలలో ఏది మిస్ అయిందని అనుకుంటున్నారో అది ఈ సినిమాలో ఉంటుంది.

ట్రైన్ ఎపిసోడ్ చాలా హిలేరియస్ గా వచ్చింది. నేను చెప్పడం కంటే మీరు అది తెరపై చూస్తే బాగుంటుంది. 360 డిగ్రీస్ లో మహేష్ గారు చించి అవతలేశారు. ఈ సినిమా ఫుల్ మీల్స్ లాగా ఉండబోతోంది. మహేష్ లాంటి సూపర్ స్టార్ మన సినిమాలో ఉన్నప్పుడు కథ లేకుండా ఊరికే కామెడీ చొప్పిస్తే బాగుండదు. ఈ సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ సరిగ్గా కుదిరాయి.

ఈ సినిమాకి కథ, కంటెంట్, మహేష్ గారి క్యారెక్టరైషేషన్, ఆయన్ ఎనర్గీ లెవల్స్ ఎంత ఫ్రెష్ గా ఉంటాయో అంతే ఫ్రెష్ గా విజయశాంతి గారి రోల్ కూడా ఉంటుంది. మనకు ఆ కాంబినేషన్ యే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మహేష్ గారికి విజయశాంతి గారికి మధ్య ఉండే సీన్స్ గానీ, ఎమోషనల్ కంటెంట్ గానీ చాలా బాగుంటుంది. ఇట్స్ గోయింగ్ టూ బి ఫీస్ట్ అండి. అంతే.

మహేష్ పేకాడేశారు. సరిలేరు నీకెవ్వరు మహేష్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులకు కూడా ఒక ఫీస్ట్ అంటూ సినిమా గురించి గొప్పగా చెప్పారు అనిల్. కొండారెడ్డి బురుజు అనగానే ఒక్కడు సినిమా గుర్తొస్తుంది మరి ఈ సినిమా లో ఆ ఎపిసోడ్ అలా ఉంటుంది? అని అడిగితే దాదాపు 15 ఏళ్ళు అయినా ఇంకా కొండారెడ్డి బురుజు అనగానే ఒక్కడులో మహేష్ గారి డైలాగ్ గుర్తొస్తుంది.

ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక ఎలిమెంట్ ను మా కథలో వాడుకున్నాం. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో ఆ బురుజు దగ్గరే కొంత కథ సాగుతుంది. ఆ ఎపిసోడ్ ఎవరి అంచనాలకు తగ్గకుండా ఉంటుంది. మహేష్ మాస్ యాక్టింగ్ కూడా ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా కుదిరింది అన్నారు. తాను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఈ మాట చెప్పడం లేదు.

కచ్చితంగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకులకు ఒక ఫుల్ మీల్స్ విందే అని అనిల్ ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో కావాల్సినంత కామెడీ ఉంటుందని ప్రేక్షకులు బాగా నవ్వుకోవచ్చని దాంతో పాటుగా హృదయాల్ని టచ్ చేసే ఒక మంచి కాన్సెప్ట్ కూడా ఉంటుందని కథాబలం ఉన్న సినిమా ఇదని అనిల్ అన్నారు. పండక్కి ప్రేక్షకులు ఎలాంటి సినిమా కోరుకుంటారో అలా సరిలేరు నీకెవ్వరు ఉంటుంది.

నిన్నే ఫస్ట్ హాల్ కూడా లాక్ చేసేసాం. ఫస్ట్ హాఫ్ రష్ చూసాం. వుయ్ ఆర్ వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ. ఎవరి పాత్రలు వారు ఇరగదీసి అవతల వేసారు. అంత బాగా వచ్చింది అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. అనిల్ చెప్తున్న మాటలు చూస్తుంటే సరిలేరు నీకెవ్వరు పై అంచనాలు డబల్ అయిపోయాయి. 2020 సంక్రాంతి కోసం అప్పుడే ఎదురుచూపులు మొదలయ్యాయి.

Share

Leave a Comment