మామూలుగా లేదుగా..

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. నవంబర్‌ 23 యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి పుట్టినరోజు. ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ నవంబర్‌ 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేశారు.

మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో మహేష్‌ బాబు వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది. మీరెవరో మాకు తెలీదు. మీకు, మాకు ఏ రక్తసంబంధం లేదు. కానీ, మీకోసం పిల్లల కోసం పగలు, రాత్రి, ఎండా, వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత అంటూ సైనికుల కర్తవ్యం గురించి చెప్పే మాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయి.

ఆ తర్వాత కొంతమంది రౌడీలను ఉద్దేశించి మీరంతా నేను కాపాడుకునే ప్రాణాల్రా.. మిమ్మల్నెలా చంపుకుంటాన్రా.. మీకోసం ప్రాణాలిస్తున్నాంరా అక్కడ.. మీరేమో కత్తులు, గొడ్డళ్లేసుకొని ఆడాళ్ళ మీద.. బాధ్యత ఉండక్కర్లా.. అంటూ చెప్పే డైలాగ్‌ చాలా కొత్తగా అనిపిస్తుంది. మహేష్ మాడ్యులేషన్ అదిరింది.

ఆ తర్వాత ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో భయపడే వాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా.. అంటూ లౌడ్‌గా చెప్పే డైలాగ్‌ మహేష్‌ క్యారెక్టర్‌లోని ఎమోషన్‌ని తెలియజేస్తుంది. ఈ ఎపిసోడ్ మాస్ ప్రేక్షకులని బాగా అలరించనుంది. సినిమాలో కూడా ఈ సీన్ చాలా కీలకమైన ఎపిసోడ్ గా తెలుస్తుంది.

లేడీ అమితాబ్‌ విజయశాంతి హీరో క్యారెక్టర్‌ గురించి చెప్తూ గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్‌ అంటూ హీరో ఔనత్యాన్ని తెలియజేస్తుంది. ఆమె డైలాగ్ డెలివరీ, ఆహార్యం చాలా చక్కగా ఉంది. ఈ టీజర్‌లో విజయశాంతి 3 షాట్స్‌లో కనిపించారు. మొదటి షాట్‌లో పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించగా, రెండో షాట్‌లో వర్షంలో తడుస్తూ కనిపించారు. మూడో షాట్‌లో డైలాగ్‌తో ఆకట్టుకున్నారు.

ఈ సీన్ వెంటనే హీరో అలా నడుస్తూ వస్తుంటే వెనక ఒకరి తరువాత ఒకరు అక్కద ఉన్న రౌడీలు కింద పడుతుండగా మహేష్ వారి మధ్య నుంచి రావడం ఊర మాస్ గా ఉంది. టీజర్‌ ఎండింగ్‌లో ఇరిటేషన్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ ప్రతి స్రంకాంతికి అల్లుళ్లొస్తారు… ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అంటూ చెప్పే డైలాగ్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది.

మొత్తానికి ఈ టీజర్‌లో అన్నిరకాల ఎలిమెంట్స్‌ ఉండేలా ఎంతో కేర్‌ తీసుకున్నారనేది అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ టీజర్‌తో సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ఫన్ మాత్రమే కాకుండా సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో మహేష్ ఎక్కువగా కామెడీ చేయలేదు. మాస్ సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు. అనిల్ రావిపూడి ఈ రెండు విషయాల్లో చాలా కేర్ తీసుకున్నట్టు స్పష్టంగా కనపడింది. మాస్ అంశాలను సినిమాలో చక్కగా పొందుపరుస్తూనే అటు మాస్ ఇటు క్లాస్ అన్ని వర్గాలని ఆకట్టుకునేలా చిత్రీకరించాడు.

ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్‌ 22 వరకు ఈ షెడ్యూల్‌ కొనసాగుతుంది. నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

మహర్షి తరువాత మహేష్ చేస్తున్న సినిమా కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంచనాలకి తగ్గకుండా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. రష్మిక మందన్న, విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు

Share

Leave a Comment