కన్నడలో కూడా రికార్డు..

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన మహేష్ బాబు అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు

కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ హిట్ లు అందుకొని ఇండస్ట్రీ లో టాప్ హీరో స్థాయికి ఎదిగారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ ను తన కెరీర్ లో అందుకున్నారు మహేష్. అప్పట్లో పోకిరి సినిమా తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది. ఆ సినిమా తర్వాత మహేష్ క్రేజ్ మరింత పెరిగిపోయింది

తర్వాత కూడా ఎన్నో హిట్ లను తన ఖాతా లో వేసుకున్నారు మహేష్. అయితే ఈ ఏడాది ప్రారంభం సంక్రాంతి సీజన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు మహేష్. ఈ సినిమా సంక్రాంతి రేసులో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా నిలిచి, బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది

అయితే వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా తన సత్తా ఏంటో చూపించిందీ సినిమా. జెమినీ మూవీలో ప్రసారం అయినా సరిలేరు నీకెవ్వరు 23.4 టీఆర్పీ దక్కించుకొని సరికొత్త రికార్డు నమోదు చేసింది. 22.7 టీఆర్పీ రేటింగ్ తో బాహుబలి 2 చిత్ర రికార్డు సరిలేరు నీకెవ్వరు బీట్ చేసింది

అయితే తాజాగా ఈ చిత్రం కన్నడ లో కూడా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాను కన్నడ లో డబ్ చేసి ఇటీవల బుల్లితెరపై ప్రదర్శించారు. అక్కడ బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ దక్కించుకున్న టాలీవుడ్ డబ్బింగ్ మూవీగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది

అక్కడ ఈ చిత్రం 6.5 రేటింగ్ని సాధించింది. దీంతో మహేష్ బాబు కు కన్నడ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని అర్థమైంది. మహేష్ బాబు సినిమా తర్వాత చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 6.3, రామ్ చరణ్ రంగస్థలం 6, విజయ్ దేవరకొండ గీతా గోవిందం 5.6 రేటింగ్ ను సాధించాయి

దీనితో తెలుగు నుండి కన్నడలో అత్యధిక టీఆర్పీ అందుకున్న చిత్రంగా మేజర్ అజయ్ కృష్ణ నిలిచింది. ఇక మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట పై కూడా ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. కరోనా కారనంగా ఈ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కాలేదు

అగ్ర హీరోలలో ప్రస్తుతం ప్రయోగాలు చేసిన హీరో ఎవరైనా ఉన్నారంటే, దానికి బ్రాండ్ అంబాసిడర్ మహేష్ బాబు అనే చెప్పాలి. ఇది నిర్వివాదమైన అంశం గనుకనే తెలుగు ఇండస్ట్రీ లో ఎవరిని అడిగినా ఈ విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్తారు

సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు తన తాజా చిత్రం సర్కారు వారి పాట మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందులో మహేష్ పాత్రలో సర్ ప్రైజ్ ఉంటుందని అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఇంతకుముందు రిలీజైన మహేష్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది

Share

Leave a Comment