జోష్ మాములుగా లేదు..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. సంక్రాంతి పండుగ వేళ ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేలా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓపెనింగ్స్‌ భారీ స్థాయిలో ఉండటంతో తర్వలోనే సరిలేరు నీకెవ్వరు వందకోట్ల మార్క్‌ను దాటేసే అవకాశముందని అంటున్నారు.

తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్‌ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్‌ రాబట్టినట్లు సమాచారం. ఇక, రెండోరోజు శనివారం సాలిడ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మొత్తానికి తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు చేరువగా వచ్చిందని అంటున్నారు.

అధికారిక లెక్కలు వస్తే.. తొలి మూడురోజుల్లో ఈ సినిమా వందకోట్ల మార్క్‌ను దాటిందా? లేదా? అన్నది తెలిసే అవకాశముంది. సినిమా మూడో రోజు సోమవారం అవ్వడం తో తొలి 2 షోలకు కొంచెం డ్రాప్స్ ఉన్నా తిరిగి సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి హోల్డ్ ని సాధించి రోజుని ఘనంగా ముగించింది.

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా అనుకున్నట్లే ఉండగా మొత్తం మీద 3 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి లో కూడా రికార్డు రేంజిలో షేర్ అంటే సినిమా సాలిడ్ గా హోల్డ్ చేసినట్లే అని చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో కూడా దుమ్ము లేపుతున్న సినిమా అక్కడ 2 మిలియన్ వైపు దూసుకు పోతుంది.

మూడు రోజుల్లోనే 75-85% టార్గెట్ ని రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక 4 వ రోజు నుండి అసలు సిసలు సంక్రాంతి సెలవులు మొదలు అవుతున్నాయి కాబట్టి సినిమా జోరు మరింత పెరిగే అవకాశం ఉంది, ఇక 3 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

ఇక సినిమా అమెరికాలో ప్రీమియర్స్ అలాగే 2 రోజుల కలెక్షన్స్ తో 1.6 మిలియన్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా మహేష్ కెరీర్ లో 8 వ 1.5 మిలియన్ మార్క్ ని అందుకున్న సినిమా గా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ద్వారా 10 సార్లు యూఎస్ బాక్సాపీస్ వద్ద తొలిరోజే 1 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన ఏకైక హీరోగా నిలిచాడు సూపర్ స్టార్.

మరోవైపు ఈ సినిమాకు భారీ వసూళ్లు దక్కుతుండటంతో రోజుకొక ప్రొమో, ప్రమోషన్‌ వీడియలతో ఈ చిత్ర యూనిట్‌ హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా బ్లాక్‌బస్టర్‌కా బాప్‌ ప్రొమో వీడియోను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ సినిమా కావడం, కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచానాలను అందుకోవడం లో పూర్తిగా సక్సెస్ అయ్యరనే చెప్పాలి.

ప్రతీ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్‌లు వచ్చేవి.. ఈ సారి బ్లాక్‌బస్టర్‌కి బాబు వచ్చాడు అని పేర్కొంటూ సరిలేరు నీకెవ్వరు సత్తాను ప్రేక్షకులకు తెలియజేసింది చిత్రయూనిట్. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని టీమ్ అంతా కలిసి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మొత్తానికి మరోసారి రికార్డులు తిరగ రాస్తున్నాడు మహేష్.

గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో తన డాన్స్‌తో ఆకట్టుకున్నారు మహేష్ బాబు. ఆయన డైలాగ్ డెలివరీ, హీరోయిన్ రష్మికతో రొమాన్స్ సూపర్ స్టార్ అభిమానులకు సూపర్ కిక్ ఇచ్చాయి. ఇక ఫుల్ రన్ పూర్తయ్యే నాటికి ఈ చిత్రం మహేష్ కెరీర్లో ఉత్తమమైన వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలవడం ఖాయం.

Share

Leave a Comment