సరిరారు మాకెవ్వరు..!!

మహేష్ బాబుతో సినిమాలు చెయ్యడానికి నిర్మాతలు క్యూ కడతారు. మహేష్ బాబు ఎప్పుడు ఫ్రీ అవుతాడు, డేట్స్ ఎప్పుడిస్తాడో అంటూ ఎదురు చూసే నిర్మాతలు బోలెడంత మంది ఉంటారు. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే కానీ… కోట్ల బడ్జెట్ తో రెడీ అయ్యేవారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు.

అది సూపర్‌స్టార్ క్రేజ్ అంటే… ప్రోడ్యూసర్స్ మహేష్ తో చేయాలనుకోవడం లో కూడా ఒక బలమైన రీజన్ ఉంది. మహేష్ తో సినిమా చేసి సూపర్‌హిట్ కొడితే ఇక తిరుగుండదు..అలా కాకుండా యావరేజ్ పడినా.. మహేష్ క్రేజ్‌ వల్ల మార్కెట్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే మహేష్‌తో సినిమాలంటే ఇంట్రెస్ట్ చూపుతారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. మరో మూడు వారాల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాబోతుందని సమాచారం. పక్క మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

ఇదిలావుంటే డిసెంబర్‌ నుంచి సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్లు మోత మోగిస్తారని సమాచారం. ఈ ప్రచారం లో భాగంగా మాస్‌ సాంగ్‌ని విడుదల చేసి అభిమానులని అలరించనున్నారని వినికిడి. ఇప్పటికే ఈ మాస్ సాంగ్ గురించి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారు తన ట్విట్టర్ లో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మిగతా చిత్రాలకి ఎంత పబ్లిసిటీ చేసినా కానీ రిలీజ్‌కి ముందు తాము చేసే పబ్లిసిటీ ముందు సరిరారు మాకెవ్వరు అని అభిమానులు ఎంతో కాంఫిడెంట్ గా ఉన్నారు. ఈ చిత్రంపై మహేష్‌ అచంచలమైన నమ్మకంతో వున్నాడు. పోకిరి, దూకుడు తర్వాత మళ్లీ అలాంటి మాస్‌ ఎంటర్‌టైనర్‌ చేయలేదు కనుక ఈ చిత్రాన్ని జనం అదే రేంజి లో ఆదరిస్తారని అందరూ విశ్వసిస్తున్నారు.

మహర్షి లాంటి భారీ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టాలని పక్కాగా స్క్రిప్ట్‌ను తయారు చేసుకుని సరిలేరు నీకెవ్వరు తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్‌‌కు కూడా ఇబ్బంది ఏర్పడకుండా పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూ అనవసరమైన బ్రేక్స్ రాకుండా చూసుకుంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలోని సాంగ్స్ ని ఎంతో అదరగొట్టేలా సిద్ధం చేసిన దేవి, ప్రత్యేక గీతమైన మాస్ సాంగ్ ని మరింత అద్భుతంగా కంపోజ్ చేసారని వినికిడి. ఆ మాస్‌ పాటను విన్న అనిల్‌ సుంకర..ఆ పాట ‘కేక’ అని చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులకు ఇచ్చిన ప్రామిస్‌ను దేవిశ్రీ నిలబెట్టుకున్నారన్నారు.

‘మహర్షి’ తరువాత ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని పూర్తిచేస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం పూర్తికాగానే మహేష్ 2 నెలలు గ్యాప్ తీసుకుంటాడనేది తాజా సమాచారం. సాధారణంగా సినిమాకి.. సినిమాకి మధ్య మహేష్ గ్యాప్ లో తన తదుపరి సినిమా కోసం కథలు వింటుంటాడు.

అయితే ‘మహర్షి’ తరువాత అనిల్ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడు కాబట్టి వెంటనే సినిమా మొదలు పెట్టాశాడు మహేష్. సరిలేరు నీకెవ్వరు సినిమాలో సైతం అనిల్ రావిపూడి యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఉండేలా చూసుకుంటున్నాడట. సరిలేరు నీకెవ్వరు అన్నట్లుగా అలరించే విధంగా ఈ చిత్రంలోని మహేష్ పాత్ర ఉంటుందట.

ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలో కూడా టైటిల్ కు తగ్గట్లుగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. చాలా రోజుల తరువాత మహేష్ నుంచి వస్తున్న ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 12 జనవరి 2020న అసలైన ట్రీట్ ఉంటుంది.

Share

Leave a Comment