నిజమైన మహేష్ సర్ ని చూశాను

టాలీవుడ్ లో సక్సెస్ అయిన ప్రతీ హీరోయిన్ బాలీవుడ్ వైపు వెళ్ళాలనుకుంటారు. ఒక వేళ అక్కడ కూడా సక్సెస్ అయితే తిరిగి టాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడరు అనేది ఎప్పుడూ వుండే వార్తే. ఒక వేళ అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ టాలీవుడ్ కో కోలీవుడ్ కో రిటర్న్ అవుతారు. కానీ నేను వాళ్ళందరికంటే భిన్నం అంటున్నారు ఈ హీరోయిన్.

ఆమే తన అందంతో అలరించినా లేక తన నటనతో మెప్పించినా తనకంటూ ప్రత్యేకశైలి ని ఏర్పరుచుకున్న కియారా అడ్వానీ. భరత్‌ అను నేను చిత్రంతో తెలుగు ప్రజల మనసుపై చెరగని ముద్ర వేసారు కియారా. తెలుగులో తన మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించడంతో ఆమె ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకుపోయారు.

బాలీవుడ్ లో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా తెలుగు సినిమాలు చేస్తా అని ఇటీవల హైదరాబాద్ వచ్చిన కియారా మీడియాతో చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూ నుంచి మరిన్ని విశేషాలు మీ కోసం. దర్శకుడు కొరటాల గారికి, సూపర్‌స్టార్ మహేష్ గారికి థాంక్స్ చెప్పదలుచుకున్నాను. నా మీద నమ్మకం ఉంచి భరత్‌ అను నేను లో నాకు అంత మంచి రోల్ ఇచ్చారు.

మహేష్ బాబు లాంటి హీరో తో నా ముదటి సినిమా చాన్స్ రావడం నిజంగా చాలా గొప్ప అవకాశం, ఇంకా చెప్పాలంటే గ్రేట్ ఫుల్. భరత్‌ అనే నేను సినిమాకి ముందు మహేష్‌ సర్ గురించి నాకు పెద్దగా తెలీదు. దక్షిణాదిన తనో పెద్ద స్టార్‌ అనే తెలుసు. తన సినిమాలు కొన్ని చూశాను. సెట్లో అడుగుపెట్టాక నిజమైన మహేష్‌ సర్ ని చూశాను. తన సెన్సాఫ్‌ హ్యూమర్‌కి అభిమానిని అయిపోయా.

మహేష్ సర్ కేవలం తన సీన్స్ వరకు చేసి కామ్ గా ఉండరు. ప్రతి సన్నివేశం బాగా రావాలంటే తానొక్కడి నటనే కాదు అందరు బాగా నటిస్తేనే సీన్ పండుతుందనే ఉద్ధేశ్యంతో తన కాంబినేషన్ లో లేని సీన్స్ ని కూడా మానిటర్ లో చూసి, దర్శకుడు కొరటాల శివ సర్ ఆలోచనలకు అనుగుణంగా సీన్స్ బాగా వస్తున్నాయా లేదా అని గమనిస్తూ ఉంటారు.

మహేష్ సర్ ఉంటే సెట్ లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన పాత్రల్లో లీనమయ్యే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతీ సన్నివేశం ఇంకా మొదటి సినిమాలానే ఆలోచిస్తారు. ఆయన అంత పెద్ద స్టార్ ఎందుకయ్యారో మనకు అర్థం అయిపోతుంది. నటనపరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.

మహేష్ సర్ తో నటిస్తున్నప్పుడు అన్ని మొమెంట్స్ మెమొరబుల్ గానే గడిచాయి. సెట్‌లో నమ్రత, సితార మంచి స్నేహితులయ్యారు. వారు నాకోసం భోజనం పంపేవారు. ఇక ఆయన ఫ్యాన్స్ గురించి కూడా చెప్పి తీరాలి. అందరూ నా మీద చాలా ప్రేమ చూపించారు. అందరికి చాలా థ్యాంక్స్. భరత్ అనే నేను నాకెప్పుడు స్పెషల్ గానే ఉంటుంది. ఎప్పటికీ ఈ చిత్రాన్ని మరిచిపోలేను అని తెలిపారు.

ఫిట్నెస్‌ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. రోజుకి ఒక్క గంటైనా మీ శరీరం కోసం కేటాయించండి. కాలినడక కంటే గొప్ప వ్యాయామం లేదు. ప్రేమపై నాకు చాలా గౌరవం ఉంది. మా అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. వాళ్లని, వాళ్ల ప్రేమని చూస్తూ పెరిగినదాన్ని. వాళ్ల మధ్య అనుబంధం చూస్తుంటే నేనూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంటా అని చెప్పారు కియారా అడ్వానీ.

లేటెస్ట్‌గా సందీప్ వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్ సరసన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో నటించి బ్లాక్‌బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు కియారా అడ్వానీ. ఇక తన 25వ సినిమా మహర్షితో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని తన 26వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మన సూపర్‌స్టార్ మహేష్ బాబు.

అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమానే సరిలేరు నీకెవ్వరు. కశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరు తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. రెండో షెడ్యూల్ ఈనెల 26 నుంచి హైదరాబాద్ లో ప్రారంభమవుతుందని అనీల్ రావిపూడి తాజా ట్వీట్ లో వెల్లడించారు. మహేష్ బాబు తొలిసారి ఓ మిలటరీ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అనీల్ రావిపూడి ఎంతో జోష్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫన్, రొమాన్స్, దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇన్ని అంశాల మేలు కలయికగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

Share

Leave a Comment