ప్రతీ ఫ్యాన్ గర్వపడే విషయాలు

మహేష్‌ కి మాస్‌ నుంచి క్లాస్‌ వరకు, అమ్మాయిలు, ముసలివారు, చిన్నారులు. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ అభిమానులు ఉన్నారు. అతనికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. అవే మహేష్ ని నేడు ఇంతటి సూపర్ స్టార్ ఆల్ రౌండర్ ని చేసాయి. అవేంటో మీరు చూడండి.

థి సోషల్ మ్యాన్ – మహేష్ బాబు మంచి మనసున్న మనిషి అని అనేక సార్లు నిరూపించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అయన ఎంతోమందికి సాయం చేశారు. రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. చేసిన సాయాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుని ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో తాము చేసిన మంచి పనులను కూడా ప్రచారం చేసుకోకపోవడం నిజంగా గొప్ప విషయం.

థి గ్రీక్ గాడ్ లుక్ – ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరో మ‌హేష్. అత‌డి ఛరిష్మాకి బాలీవుడ్ సైతం అద‌రాల్సిందే. అచ్చం హాలివుడ్ హేరో లా ఉంటాడు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇక హీరోయిన్స్ మహేష్ ని పొగడటం లో ఎటువంటి ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే మహేష్ మోస్ట్ డిసైరబుల్ అని జాతీయంగా చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు.

డైలాగ్ డిక్షన్ – మహేష్ తో పని చేసిన తోటి నటీనటులంతా “ప్రిన్స్ పక్కా ప్రొఫిషనల్.. స్వీట్ సూపర్ స్టార్..మహేష్ ఈజ్ ధి పర్ఫెక్షనిస్ట్” అంటూ ప్రేమ కురిపిస్తారు. డైలాగ్ డెలివరీ లో తనదైన ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అన్ని స్లాంగ్ లని అలవోకగా పలికిస్తారు. అందరిలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండవు కాని చిన్న చిన్నవి చాలా ఇంపాక్ట్ ఇచ్చేట్టు చేయడం మహేష్ స్పెషాలిటీ.

సెన్స్ ఆఫ్ హ్యూమర్ – సూపర్ స్టార్ మహేష్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ అందగాడే కాదు అంతకుమించి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు అన్నది తనతో పనిచేసిన వారు చెప్పే మాట. చిత్రీకరణలో ఎవరెంత పని చేసినా, ఎంత కష్టపడినా..మహేష్ ఒక్క జోక్‌ వేస్తే చాలు, సెట్‌ లోని అందరూ నవ్వుల్లో తేలిపోయి కష్టం మర్చిపోతారని చెప్తారు.

డౌన్ టూ ఎర్త్ యాటిట్యూడ్ – మహేష్ సీనియర్ నటుడైనా అలాంటి భేషజాలు ఆయనలో కనిపించవు. టీమ్‌తో చక్కగా కలిసిపోతారు. ప్రతి ఒక్కరూ బాగా నటించాలని, అందరి షాట్స్‌ చక్కగా రావాలని కోరుకునే వ్యక్తి మహేష్ అని తనతో వర్క్ చేసిన అనేక మంది హీరోయిన్స్ చెప్పారు. సూపర్ స్టార్ అయినా కూడా కొంచెం కూడా గర్వం లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడు.

పర్ఫెక్ట్ ఫ్యామిలి మ్యాన్ – మహెష్ బాబు తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో, కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు మహేష్ ప్రయత్నిస్తారు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా కుటుంబం తో విహార యాత్రలకు వెలుతూవుంటారు.అందుకే సూపర్ స్టార్ హీరోనే కాదు బాధ్యత గల తండ్రి కూడా.

నైజాం నవాబ్ / ఒవర్సీస్ బాద్‌షా – అసలు తెలుగు సినిమాకి మన బౌండరీల అవతల గుర్తింపు తెచ్చింది మహేషే. అమెరికా లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. ఇక్కడ సరిగ్గా ఆడని సినిమాలు సైతం అక్కడ కాసుల వర్షం కురిపించాయి. 1.5 మిలియన్ సినిమాలు 5, 2.5 మిలియన్ సినిమాలు 2, 500కె+ ప్రీమియర్స్ సినిమాలు 5 ఉన్న ఏకైక హీరో సూపర్ స్టార్ మాత్రమే.

Share

Leave a Comment