మైండ్‌బ్లోయింగ్‌ అండ్ ఫెంటాస్టిక్‌

ఆషికి-2 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన శ్రద్దా కపూర్ కేవలం నటిగా మాత్రమే గాక సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటివల విడుదలైన స్త్రీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు శ్రద్దా కపూర్. బాలీవుడ్‌లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన శ్ర‌ద్ధా కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ చిత్రంతో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఒక ప్రమోషన్ ఈవెంట్ లో ఆమె తెలుగు సినిమాల గురించి మరియు మహేష్ బాబు మీద తనకున్న అభిమానాన్ని తెలిపారు. మ‌హేష్ గురించిన ప్ర‌శ్న‌కు స్పందిస్తూ `ఆయ‌న మైండ్‌బ్లోయింగ్‌, ఫెంటాస్టిక్‌` అని తెలిపారు శ్ర‌ద్ధా కపూర్. మంచి ఆఫర్ వస్తే మహేష్ తో కలిసి నటించడానికి తాను రేడి అని వెల్లడించారు.

ప్రస్తుతం తాను సాహో, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం సైనా చిత్రాలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. ప్రభాస్ తో నటించడం చాలా బావుందని తను ఇంకా తెలుగు సినిమాలు చేయటానికి ప్రయత్నిస్తానని చెప్పారు. సైనా బయోపిక్‌కు అమోల్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో ప్రారంభమైంది. ‘సైనా నెహ్వాల్‌ కంట్రీస్‌ స్వీట్‌హార్ట్‌. చాంపియన్‌. ఒక యూత్‌ ఐకాన్‌. ఆమె జీవితంలో కూడా ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆమె బయోపిక్‌లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు శ్రద్ధ. సూపర్‌స్టార్ మహేష్ బాబు చార్మింగ్ పర్సనాలిటి నే కాకుండా ఆయన వ్యక్తిత్వం ని అందరు ఇష్టపడతారు.

చాలా మంది హీరోయిన్స్ మహేష్ తో కలిసి నటించాలని ఉంది అని ఇప్పటికే చాలా సందర్భాలలో వెల్లడించారు. ఇప్పుడు ఈ జాబితా లోకి శ్ర‌ద్ధా క‌పూర్‌ కూడా చేరారు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ తన ల్యాండ్ మార్క్ ఫిలిం మహర్షి లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన సన్నివేశాలతో పాటు రెండు పాటలను పూర్తి చేస్తారట. అమెరికా లో హీల్-ఎ-చైల్డ్ ఆండ్ గ్రామం ఫౌండేషన్ ఆద్వర్యం లో జరిగే ఫండ్ రైజర్ కి స్పెషల్ గెస్ట్ గా అక్కడి ప్రవాస భారతీయ కుటుంబాలతో కొద్ది సమయం గడపనున్నారు మహేష్ బాబు.

Share

Leave a Comment