మహేష్ కి థ్యాంక్స్ చెప్పిన శృతి..

సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు రోజుల క్రితం తన 45వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు నాడు ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. అభిమానులంతా ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు

అలాగే, ఈ ఛాలెంజ్‌కు తమిళ స్టార్ హీరో విజయ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, హీరోయిన్ శృతిహాసన్‌ను నామినేట్ చేశారు. ఇప్పటికే విజయ్ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇది మీకోసమే మహేష్ బాబు గారు. హరిత భారతం, మంచి ఆరోగ్యం కోసమే ఇది. థాంక్యూ, సురక్షితంగా ఉండండి అని విజయ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు

ఇప్పుడు శృతిహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. మహేష్ బాబు తో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ శృతిహాసన్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను విసిరారు. శృతి నిన్న ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ పిక్స్ ను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది

అందుకే తనను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేసినందుకుగాను మహేష్ బాబుతో పాటు దేవిశ్రీ ప్రసాద్‌కు శృతిహాసన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతోన్న ఫొటోలను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు

ఈ ఛాలెంజ్‌ను తాను బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్, కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి, మిల్కీ బ్యూటీ తమన్నాకు విసురుతున్నట్టు శృతిహాసన్ పేర్కొన్నారు. శృతిహాసన్ ట్వీట్‌కు సూపర్ స్టార్ స్పందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించినందుకు శృతిహాసన్‌ను అభినందించారు

ఈ మంచి పని మరింత ముందుకు వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, మహేష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించడంలో మిగిలింది ఇక ఎన్టీఆర్ మాత్రమే. ఆయన కూడా త్వరలోనే మొక్కలు నాటి ఈ ఛాలెంజ్‌ను పూర్తిచేయొచ్చు. దీని కోసం ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు

ఇదిలా ఉంటే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఇతర సినీ పరిశ్రమల్లోని స్టార్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది

అలాగే తన తాజా చిత్రం సర్కారు వారి పాట మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశారు. ఇందులో మహేష్ పాత్రలో సర్ ప్రైజ్ ఉంటుందని అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఇంతకుముందు రిలీజైన మహేష్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది

Share

Leave a Comment