నా ఫేవరెట్ మూవీ

లోకనాయకుడు కమల్ హాసన్ గారి వారసురాలిగా మనందరి ముందుకు వచ్చారు శృతిహాసన్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా నటనలో తండ్రికి తగ్గ తనయురాలిగా మంచి పేరును సంపాదించారు ఆమె. ఈ మధ్య ఆమె సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారనే చెప్పాలి

తెలుగు తెరపై శృతి హాసన్ కనిపించి చాలా రోజులే అయ్యిందన్న సంగతి మనకు తెలిసిందే. తెలుగు అనే కాదు వేరే భాషల్లో కూడా ఈమె నటించిన సినిమాలు ఏమీ ఈ మధ్య కాలంలో విడుదల కాలేదు. అటువంటి సమయంలో ఆమె ఒక తమిళ చానెల్ టాక్ షోలో ప్రత్యక్షమయ్యారు.

తన గురించి తన సినిమాల గురించి పలు విషయాలను ఆమె ఆ టాక్ షోలో పంచుకున్నారు. మీరు ఇన్ని భాషల్లో నటించారు కదా మీకు ఇష్టమైన సినిమా ఏది అని ఆ షో వ్యాఖ్యాత బాలాజీ శృతిహాసన్ ను అడిగారు. అందుకు ఆమె మహేష్ బాబు కొరటల శివ ల శ్రీమంతుడు అని సమాధానమిచ్చారు.

అన్ని భాషల్లోంచి అందులోనూ ఒక తమిళ షోలో మన శ్రీమంతుడు గురించి చెప్పారంటే ఆ సినిమా ఆమెకు ఎంత ప్రత్యేకమో మనకు అర్థమవుతుంది. ఇది వరకు ఒక ఈవెంట్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఆమె శ్రిమంతుడు, మహేష్ బాబు గురించి ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు.

నాకు తెలుగు సినిమాలతో మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. మహేష్‌ బాబు సరసన నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఆయన ఒక జెంటిల్ మ్యాన్. ఎప్పుడూ నవ్వుతూ మనల్ని కూడా నవ్విస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా సినిమాల గురించే మాట్లాడతారు. చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి మహేష్ గారితో అని చెప్పారు.

జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చిన వారు సొంతూరు బాగు కోసం పాటుపడాలన్న ఆలోచనతో తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. డబ్బున్నవాడు కాదు, మనసున్నోడే అసలైన శ్రీమంతుడనేది ఒక్క లైన్ లో ఈ సినిమా స్టోరీ. సామాజిక స్పృహ ను పెంచే కథతో సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఓ స్టార్ హీరో ఈ సినిమా చేయడం అందరినీ ఆలోచింపజేసింది.

సినిమాల్లోకి రాక‌ముందే శృతిహాస‌న్ గాయ‌కురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు. క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఈనాడు సినిమాకు సంగీత ద‌ర్శ‌కురాలిగా కూడా ప‌ని చేసారు ఆమె. ఈ మధ్య లండన్‌లో ఓ షో కూడా ఇవ్వడంతో శృతి దాదాపుగా ట్రాక్ మార్చేసినట్టే అని ఆ సమయంలో అందరూ అనుకున్నారు. మరి ఆమె మనసులో ఏముందో!

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. వరుస విజయాలతో టాలీవుడ్‌లో ముందుకెళ్తున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో సరికొత్త కలెక్షన్ల రికార్డులను సొంతం చేసుకొన్నాడు. తాజాగా ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద మహేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ప్రస్తుతానికి మహేష్ 27వ చిత్రం అఫీషియల్ గా కంఫార్మ్ అయింది. త్వరలోనే వంశీ పైడిపల్లితో తన తదుపరి సినిమా చేయనున్నాడు. గతంలో మహర్షి వంటి హిట్ ఇచ్చిన స్టైలిష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మరో సారి కొత్త కథ కధానాలతో మన ముందుకు రానున్నారు.

ప్రస్తుతం వంశీ ఈ సినిమా స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నాడు. ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అని సమాచారం. ఈ సినిమా లో నటించబోయే హీరోయిన్ ఎవరా అని ఇప్పటికే అనేక ఊహా గానాలు కొనసాగుతున్నాయి. మహేష్ కారెక్టరైజేషన్ గురించి కూడా అనేక కధనాలు వెల్లువడుతున్నాయి. కాని అఫీషియల్ గా ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి కంఫర్మేషన్ రాలేదు.

Share

Leave a Comment