శ్రుతీహాసన్‌ ప్రశంసలు

సూపర్‌స్టార్‌గా దూసుకుపోతూ కాసింత విరామం దొరికినా ఫ్యామిలీతో గడుపుతూ ఫ్యామిలీ మ్యాన్‌గానూ మంచి మార్కులు సంపాదించారు మహేష్‌ బాబు. ఫ్యామిలీతో సరదాగా మహేష్‌ గడుపుతూ ఉంటే ఆయన ఫ్యాన్స్‌కు వాటికి సంబంధించిన అన్ని అప్‌డేట్స్‌ ఇస్తూ ఉంటారు నమ్రత.

వీరిద్దరి ప్రేమ వివాహానికి నేటితో పద్నాలుగేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా మహేష్‌బాబు సోషల్ మీడియా ద్వారా తన అర్దాంగికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దాంతో పాటు ఓ ఫోటో కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పిక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫోటోపై శ్రుతీహాసన్‌ కూడా స్పందించారు.

ఈ ఫోటోను శ్రుతీహాసన్‌ షేర్‌ చేస్తూ ఫోటో బాగుంది, అందమైన జంట అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు శ్రుతీహాసన్‌ కు ధన్యవాదాలు తెలుపుతూ రీట్వీట్ లు చేస్తున్నారు. చాలా ధ్యాంక్స్ చారుశీల అని పోస్ట్ లు చేస్తున్నారు మహేష్‌ అభిమానులు.

మహేష్‌, శ్రుతీహాసన్‌ కాంబినేషన్‌లో కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. శ్రీమంతుడు లో శ్రుతీహాసన్‌ పోషించిన పాత్ర పేరు చారుశీల. దీంతో మహేష్ బాబు అభిమానులు అందరూ ఆమెను ఆ పేరుతో పిలుస్తున్నారు అనమాట.

మహేష్‌బాబు షేర్‌ చేసిన ఫోటోపై సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ కూడా సోషల్ మీడియాలో స్పందించారు. మహేష్ పోస్ట్ చేసిన ఫొటోని కోట్ చేస్తూ దేవి ఇలా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసారు ‘హ్యాపియస్ట్ మ్యూజికల్ పద్నాలుగవ పెళ్ళి యానివర్సరీ టు ది మోస్ట్ లవ్లీ కపుల్.

విషింగ్ యు బోత్ ది బెస్టెస్ట్ ఆఫ్ లైఫ్ డియర్ మహేష్ బాబు సర్ అండ్ నమ్రత మామ్’ అని పోస్ట్ చేసారు. మహేష్ బాబు మరియు దేవీశ్రీప్రసాద్ కి మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం మహేష్ సినిమాలన్నిటికీ దేవీనే సంగీత దర్శకుడు. మహర్షి తో పాటు సుకుమార్ తో చేయబోయే సినిమాకు కూడా దేవీనే సంగీత దర్శకుడు.

తన పెళ్లి రోజును పురస్కరించుకుని ఉదయం సూపర్ స్టార్ తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ ఫోటోను పోస్ట్ చేసి తన సతీమణి నమ్రతకు శుభాకాంక్షలు తెలియజేసారు. ‘అందమైన జ్ఞాపకాలు. హ్యాపీ యానివర్సరీ మై లవ్‌’ అని మహేష్ క్యాప్షన్‌ ఇచ్చారు. నమ్రత నవ్వుతుంటే మహేష్ ఆమెను చూసి మురిసిపోతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అభిమానులు ఈ ఫొటోను లైక్ లు, షేర్లతో సోషల్ మీడియా ను ముంచెత్తుతున్నారు. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ అభిమానులు వారికి శుభాకాంక్షలు‌ తెలుపుతున్నారు. నమ్రత తన జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత సంతోషం తన లైఫ్‌లోకి వచ్చినట్లయిందని మహేష్ బాబు తరచూ చెబుతుంటారు.

మహేష్ బాబు, నమ్రతలు ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలిసిందే. మహేష్ బాబును వివాహమాడిన తర్వాత మెల్లగా నటనను పక్కనబెట్టేసి నమ్రత పిల్లల్ని చూసుకోవడం, మహేష్ బాబుకు అన్ని వ్యవహారాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మహేష్ ఇంత వేగంగా ఎదగడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడం వెనుక ఆయన కష్టంతో పాటు నమ్రత విజన్ కూడా ఉందని అంటుంటారు సినీ జనం.

అంతలా మహేష్ బాబు జీవితంలో కలిసిపోయారు నమ్రత. ఒక‌రి కోసం ఒక‌రు అన్న‌ట్లుగా ఉంటారు. ఇన్నేళ్ల‌లో ఒక్క‌సారి కూడా మ‌హేష్, న‌మ్ర‌త జంట‌పై చిన్న రూమ‌ర్ కూడా రాలేదంటే వాళ్ల దాంప‌త్యం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఇద్ద‌రి ప్రేమ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు.

భార్యాభ‌ర్త‌లు అంటే ఇలా ఉండాలి అంటూ వాళ్ల‌ను చూపిస్తున్నారు. మొత్తానికి ఇద్ద‌రు పిల్ల‌లు, భార్య‌తో లైఫ్ ఆనందంగా మార్చేసుకున్నాడు సూప‌ర్ స్టార్. అభిమానులు కూడా ఈయ‌న్నే ఆద‌ర్శంగా తీసుకుంటున్నారు. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి కూడా కావాల్సినంత టైమ్ ఇస్తాడు సూప‌ర్ స్టార్. పూర్తి ఫ్యామిలీ మ్యాన్ సూపర్ స్టార్.

ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం జరిగింది. 14 ఏళ్ల తమ దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు మహేష్, నమ్రత. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతం జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది. టాలీవుడ్ బెస్ట్ క‌పుల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Share

Leave a Comment