మహర్షితో శింబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మహర్షి” సినిమాతో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పల్లెటూరును సృష్టించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఈ రోజు మహర్షి షూటింగ్ స్పాట్‌కి ఒక అనుకోని అతిధి వచ్చారు. ఆయన మరెవరో కాదు, తమిళ స్టార్ హీరో శింబు. దీంతో మహేష్ బాబు, శింబు కలిసి చాలా సేపు ముచ్చటించుకున్నారు. శింబు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ లోనే తన సినిమా షూటింగ్ జరుపుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోలు కలుసుకున్నారన మాట.

మహేష్, శింబు కలిసి మాట్లాడుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో వాటిని లైక్‌లు, షేర్‌లు చేస్తూ అభిమానులు వాటిని వైరల్‌గా మార్చేసారు. శింబు కంటే ముందు నిన్న ఇంకో అతిధి మహర్షి షూటింగ్ స్పాట్ కు వచ్చి మహేష్ బాబును కలుసుకున్నారు.

106 సంవత్సరాలున్న రేలంగి సత్యవతి అనే మహిళ మహేష్ బాబుపై అభిమానంతో రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వచ్చి ఆయనను కలవటం జరిగింది. తనకు మహేష్ బాబును చూడాలని ఉందని అతడితో ఒక ఫొటో దిగాలని ఉందని ఆ బామ్మ చెప్పడం ఆమద్య మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

ఆ విషయం చివరకు మహేష్ బాబు వరకు వెళ్లింది. అంత పెద్ద మనిషి తనను చూడాలని కోరుకుంటుందని తెలిసిన మహేష్ బాబు వెంటనే స్పందించారు. ఆమెతో చాలా సమయం ఆప్యాయంగా మాట్లాడి ఆమె యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు మహేష్. ఆమె కోరుకున్నట్లుగా ఫొటోను కూడా తీసుకుని ఆమెను సంతోష పెట్టారు.

ఇటీవలే ‘భరత్ అనే నేను’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సొంతం చేసుకున్న మహేష్  తన 25వ సినిమాగా మహర్షిలో నటిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా  అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Share

Leave a Comment