గ్రాండ్‌గా సెలెబ్రేషన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్న, ఫ్యామిలీకి మాత్రం ప్రాధాన్య‌త‌ ఇస్తాడనే విషయం తెలిసిందే. కూతురితో ఎంతో స‌ర‌దాగా ఉండే మ‌హేష్ , సితార‌కి సంబంధించిన ప‌లు విష‌యాల‌ని అప్పుడ‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కి చేర‌వేస్తుంటాడు.

ఈ రోజు (జూలై 20) సితార ఆర‌వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌న కూతురితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. అంతేకాదు సితార‌తో కేక్ కూడా క‌ట్ చేయించాడు. నమ్రత గారు తన సంతోషాన్ని తెలియజేస్తూ సితర పిక్స్ ని అభిమానుల కోసం తన ఇన్‌స్టాగ్రాం ఖాతా లో షేర్ చేసారు.

ఇక అభిమానులు సితార బ‌ర్త్‌డే సంద‌ర్భంగా హ్య‌ష్ ట్యాగ్‌ని క్రియేట్ చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. సితార చిట్టీ పాప కు శుభాకాంక్షలు అని నిన్న సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతునే ఉంది.

సితార గత పుట్టినరోజు వేడుకలు కూడా ఇలానే సింపుల్ గా జరిగాయి. సితార అంటే మహేష్ బాబుకు ప్రాణం. కూతురును తన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారాయన. మహేష్ బాబు ఎంత బిజిగా ఉన్న మొదటి ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం కుటుంబంతో గడపడానికే. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎలాంటి పనులు పెట్టుకోకుండా కూతురు పుట్టినరోజున కుటుంబంతోనే టైమ్ స్పెండ్ చేసారు.

సితార అప్పుడ‌ప్పుడు మ‌హేష్ మూవీ సెట్స్‌కి వెళ్ల‌డం, అక్క‌డ టీంతో క‌లిసి సంద‌డి చేయ‌డం మ‌నం చూసాం. ప‌లు సంద‌ర్భాల‌లో సితార హ‌మ్ చేస్తుండ‌గా, ఆ వీడియోల‌ని మ‌హేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఎంతో చ‌లాకీగా ఉండే ఈ చిన్నారికి సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది.

Share

Leave a Comment