సితారా.. మజాకా !

మహేష్ బాబు గారాల పట్టి సితార ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలుసు. తండ్రి సినిమాల్లోని పాటలు, డైలాగులను ఇమిటేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మహేష్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డ్యాంగ్ డ్యాంగ్ పాటకు డాన్స్ చేసి వావ్ అనిపించుకుంది సితార.

తాజాగా సితార పాప మహేష్ లేటెస్ట్ సూపర్ హిట్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌కు తమన్నా వేసిన స్టెప్పులను అచ్చుగుద్దినట్టు వేయడం విశేషం. తన డ్యాన్స్‌తో మరోసారి అదరహో అనిపించింది. సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా వేసిన స్టెప్పులను బీట్ చేసింది. ఇంతకుముందు కూడా హీ ఈజ్ క్యూట్ సాంగ్‌తో మెస్మరైజ్ చేసింది సీతు పాప.

డాంగ్‌ డాంగ్‌ సాంగ్‌కు సితార చేసిన డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్ మై డాన్సింగ్ క్వీన్ అంటూ పోస్ట్ పెట్టారు. వీడియో ఇప్పటికే వైరల్ కాగా మహేష్ ఫ్యాన్స్ సితార డ్యాన్స్ చూసి తెగ సంబరపడిపోతున్నారు. తమన్నా సైతం సితార డాన్స్ కి ఫిదా అయిపోయింది.

సితార స్టెప్పులు చూసిన తమన్నా సితార ని మెచ్చుకుంటూ సో క్యూట్ అని కామెంట్ కామెంట్ పెట్టి తన ట్విట్టర్ ఖాతా ద్వారా సితార డాన్స్ వీడియోను షేర్ చేసింది. మరోవైపు నెటిజన్లు సైతం సూపర్ సితార, చాలా అద్భుతంగా డాన్స్ చేస్తున్నావు చిట్టీ తల్లి, అప్‌కమింగ్ స్టార్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్‌తో ఇరగదీసిన సంగతి తెలిసిందే. డ్యాంగ్ డ్యాంగ్ అంటూ మహేష్ బాబును పార్టీకి పిలుస్తూ రచ్చ చేసింది మిల్కీ బ్యూటీ. ఈ సాంగ్ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్ అయిందనడంలో సందేహం లేదు. అంతే కాకుండా మహేష్ తమన్నా జంట స్టెప్పులు కూడా ఇరగదీసారు.

సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ఏ అండ్‌ ఎస్‌ అనే పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా హీరో మహేశ్‌ బాబు, హీరోయిన్‌ రష్మిక మందనలను ఇంటర్వ్యూ చేశారు.

సరిలేరు నీకెవ్వరు సూపర్ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్ళొచ్చిన సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమా కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్క్రిప్ట్‌కి తుది మెరుగులు దిద్దుతుంది చిత్రబృందం.

హీరోయిన్ ఎవరన్నేది తెలుసుకోవాలని అందరు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వంశీ ఈ సినిమా స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నాడు. ఈ సినిమా చాలా కొత్తగా ఉండబోతుంది అని సమాచారం. ఈ సినిమా తరువాత మరి మహేష్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Share

Leave a Comment