ప్రతి క్షణం చాలా స్పెషల్

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ కుటుంబంతో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డ‌తాడు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వీలున్న‌ప్పుల్లా విదేశీ యాత్ర‌ల‌కు వెళుతుంటాడు. ముద్దుల కూతురు సితార అంటే ఇంకా ఎంతో ఇష్టం. సితారకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు మహేష్.

సితార ఏడో జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హేష్ తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేశాడు. సితారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. చిన్నారి ఏడో జన్మదినం సందర్భంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఏడాది తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

‘హ్యాపీ బర్త్‌డే సితార (లవ్‌ సింబల్స్‌). కాలం చాలా వేగంగా పరుగులు తీస్తోంది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో ప్రత్యేకం. నీ జీవితం ప్రేమ, సంతోషం, పాజిటివిటీతో నిండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి. నువ్వు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా’ అని మ‌హేష్ ఎమోషన్‌తో పోస్ట్‌ చేశారు.

ఇకపోతే నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులు మరియు అతిథుల సమక్షంలో సితార జన్మదినాన్ని ఎంతో వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు మహేష్ దంపతులతో పాటు గౌతమ్, దర్శకులు అనిల్ రావిపూడి, రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్, డీవోపీ రత్నవేలు, కోటి పరుచూరి, దర్శకులు వంశీ పైడిపల్లి దంపతులు మరియు ఆయన కుమార్తె ఆద్య సహా మరికొందరు పాల్గొన్నారు.

ఇదే సందర్భంగా నమ్రత కూడా సితారను విష్‌ చేశారు. ‘నా పాపకు ఏడేళ్లు. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఓ అందమైన మహిళగా ఎదగాలని కోరుకుంటున్నా. నీదైన మార్గంలో నడుస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకో. నీ కోసం కుటుంబం ఎప్పుడూ నీ వెంటే ఉంటుందనే సంగతి గుర్తుపెట్టుకో’ అని పేర్కొన్నారు.

సితార బర్త్‌డే సందర్భంగా నమ్రత, సితార, గౌతమ్‌ వీరంతా అక్కడికి వెళ్లారు. కుటుంబ సభ్యుల కేరింతల మధ్య సితార కేక్ కట్ట చేసింది సితార. మ‌హేష్ శుక్రవారం తో సరిలేరు నీకెవ్వరు సినిమా కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నారు. తిరిగి వచ్చేవారం నుండి హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ లో పాల్గోనున్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార 7వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘట్టమనేని అభిమానులు ఊరూరా సామజిక, సేవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం బర్త్ డే సెలెబ్రేషన్స్ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.

సితారకు మరో అల్లరి పిల్ల తోడైంది. ఆ పాప మరెవరో కాదు… వంశీపైడిపల్లి కూతురు ఆద్య. ఇకపై సితార-ఆద్య కలిసి చేసే అల్లరి, సందడి మనం కూడా చూడొచ్చు. ఇద్దరూ కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. తమ ముద్దు ముద్దు మాటలు, ఆటలతో నెటిజన్లను అలరిస్తున్నారు. A &S అనే పేరుతో ఈ ఛానల్ మొదలైంది. ఇందులో ‘A’ అంటే ఆద్య. ‘S’ అంటే సితార.

ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ లో తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నారని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు అనిల్ రావిపూడి. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక ఈ చిత్రంలో జగపతిబాబు కీలకపాత్రలో నటించనుండగా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకున్నారు. ఇందులో పెద్ద వివాదం లేదంటూ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు జగపతి బాబు. అయితే జగపతిబాబు ఎమోషనల్ ట్వీట్‌పై స్పందించారు మహేష్ బాబు. ‘థాంక్యూ సార్.. మీరంటే మాకు ఎప్పటికీ ప్రేమ గౌరవం’ అంటూ ట్వీట్ చేశారు మహేష్ బాబు.

రష్మిక హీరోయిన్ కాగా విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మహేష్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Share

Leave a Comment