అదరగొట్టిన సితార

సూపర్‌స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఎంతో యాక్టివ్ గా ఉంటుందనే విషయమా అందరికీ తెలిసిందే. మహేష్, నమత్రల కూతురిగా అతి చిన్న వయసులోనే తన ఆట పాటలతో, చలాకీతనంతో మంచి గుర్తింపు తెచ్చుకొంది సితార. గౌతమ్ యమా డీసెంట్, హంబుల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్దగా హంగామా జరగదు.

కానీ మహేష్ గారాలపట్టి సితార అలా కాదు. అల్లరంతా సితార దగ్గరే ఉంటుంది. సితార మరోసారి అభిమానుల మనసులు దోచుకుంది. సితార చేసే అల్లరి, సితార ఆటపాటలకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడూ మహేష్ లేదా నమ్రత సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అందుకే సితార పాప సోషల్ మీడియాలో చాలా పాపులర్.

తాజాగా చిన్నారి మహర్షి సినిమాలోని పాలపిట్ట పాటకు డ్యాన్స్‌ చేసింది. ఈ వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోకు నువ్వెంత ముద్దుస్తున్నావో. రోజు నా పెదవిపై నిలిచే చిరునవ్వుకు నువ్వే కారణం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీడియోలో చిట్టి సితార పాల పిట్ట పాటకు ఎంతో అందంగా సూపర్ గ్రేస్ తో డ్యాన్స్ చేసింది.

మహేష్ ఎక్స్ ప్రెషన్లను కూడా అలాగే అనుకరించడం విశేషం. ఈ వీడియో చూసి ముచ్చట పడిన అభిమానులు బాగా చేస్తోందని సితారకు కితాబిచ్చారు. వీడియోలో చిన్నారి ఉత్సాహంగా స్టెప్పులు వేసిన విధానానికి నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. ఫ్యూచర్‌ సూపర్‌స్టార్‌, సూపర్‌ సితార, వీడియో షేర్‌ చేసినందుకు థాంక్స్‌ నమ్రత, ఓ మై గాడ్‌ తన ఎక్స్‌ప్రెషన్స్‌ అద్భుతంగా ఉన్నాయి అంటూ తెగ కామెంట్లు చేశారు.

మహర్షి సినిమాలోని పాలపిట్ట సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ పాటలో మహేష్ స్టెప్పులకు ఈలలు, కేకలతో సినిమా థియేటర్లు కూడా దద్దరిల్లిపోయాయి. ఇప్పుడు ఇదే పాటకు మహేష్ కూతురు సితార వేసిన స్టెప్పులకు కూడా నెటిజన్సు ఈలలు వేస్తున్నారు. చిన్న వయసులోనే సితార డ్యాన్స్ ఇరగదీస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆలస్యం ఎందుకు.. ఒకసారి మీరు కూడా సితార పాప క్యూట్ డ్యాన్స్ పై ఒక లుక్కేయండి. మరోవైపు తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటూ చిన్నతనంలోనే యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది సితార. తన స్నేహితురాలు, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యతో కలిసి యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది సితార.

A&S అనే చానల్ స్టార్ట్ చేసి, మొదటి వీడియోగా 3 మార్కర్స్ చాలెంజ్ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడ్డారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ఛానల్‌ను ఇప్పటి వరకు 20 వేల మంది సబ్‌స్క్రైబ్‌ చేశారు.

తండ్రితో పాటు షూటింగ్స్, సినిమా వేడుకలకు హాజరయ్యే సితార సామాజిక మాధ్యమాల్లో చేసే సందడికి వీరాభిమానులున్నారు. సితార ప్రతి పండగకు చేసే సందడి మామూలుగా ఉండదు. వినాయక చవితి, క్రిస్మస్, సంక్రాంతి, దసరా పండగ ఏదైనా సితార చేసే సందడి ఆషామాషీగా ఉండదు.

ఫ్రెండ్స్ తో కలిసి సితార ఒకటే అల్లరి చేసేస్తుంటుంది. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి విపరీత‌మైన రెస్పాన్స్ వ‌స్తూ ఉంటుంది. మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఖాళీ టైం దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీతో గడపడానికే ఇష్టపడతారు.

మహేష్ తన ఫ్యామిలీకి ఇచ్చే ప్రాదాన్యత గురించి అందరికీ తెలిసిందే. అలా ఆయన ఫ్యామిలీతో ఉన్న క్షణాలను ఫోన్ తో బందించి వాటిని తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సంక్రంతి కానుకగా విడుదల కానుంది.

Share

Leave a Comment