సితార చాలా స్పెషల్ అంటున్న

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఫ్యామిలి హాలిడే సందర్భంగా గౌతమ్ సితార గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు నమ్రత. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

“మై లైఫ్ బ్యాలెన్స్” అని క్యాప్షన్ పెట్టి నమ్రత ఒక స్పెషల్ పిక్ ని షేర్ చేసారు. గౌతమ్ ఆండ్ సితార తో కలిసి దిగిన సెల్ఫీ ని అభిమానుల కోసం షేర్ చేసారు నమ్రత. ఇందులో అందరూ ఎంతో హ్యాపి గా నవ్వుతూ ఉన్నారు. సితార పాప స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది. ఈ పిక్ కి వేల సంఖ్యలో లైక్స్ ఆండ్ షేర్స్ వస్తున్నాయి.

అంతే కాకుండా స్పెషల్ గా సితార తో ఇంకో సెల్ఫీ దిగి దానిని కూడా పోస్ట్ చేసారు నమ్రత. ” నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. ఐ కుడ్ స్క్విష్ యు.. ప్రతి అమ్మకి తమ కూతురు చాలా స్పెషల్.. డాటర్ లవ్ .. ఇది నా చిన్నారి రోజు, తను చాలా ఆనందంగా ఈ రోజు ని గడిపింది” అని సితార ఆడుకుంటున్న పిక్స్ ని షేర్ చేసారు.

“నో ఫిల్టర్స్, జస్ట్ న్యాచురల్ లైట్ లో దిగిన సెల్ఫీ.. స్ట్రోలింగ్, చాటింగ్, పోజింగ్..మేము అందరం కలిసి చేస్తున్నాము..ఫ్యామిలి టైమ్ ని బాగా ఆస్వాదిస్తున్నాము” అని గౌతమ్, సితార తో కలిసి జెర్మనీ దేస్శం లోని బేడెన్ అనే ఊరులో ఉన్నాము అని తెలిపారు నమ్రత.

ఇంక కొన్ని రోజుల ముందు నమ్రత గారు మహేష్ సితార నిద్రపోతున్న పిక్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకు షూటింగ్ లేకుంటే కుటుంబమే ఆయన ప్రపంచం. పూర్తి సమయం ఫ్యామిలీతో గడిపేస్తుంటారు. ఇక సితార, మహేష్ బాబు కలిస్తే మామూలుగా ఉండదు. అల్లరి చేసినా, ఆటలాడినా తన కూతుతోనే. వారు అలా సరదాగా గడుపుతుంటే నమ్రత ఆ హ్యాపీ మూమెంట్స్‌ను కెమెరాతో బంధించి అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

వీటిలో ప్రతీ ఫోటోలోను ఎంతో సరదాగా పిల్లలిద్దారు గడుపుతున్న ఆనందక్షణాలు ని చూసి అభిమానులు హర్షిస్తున్నారు. తల్లి తండ్రులు అంటే ఈ పిల్లకు ఎంత ప్రాణమో.. చెప్పకుండానే చూపించే అందమైన పిక్స్ ఇవి. టాలీవుడ్ లో బెస్ట్ డాడీ అవార్డులు పోటీ పెడితే సూపర్‌స్టార్ మహేష్ బాబు టాప్ లో ఉంటాడని చెప్పవచ్చు.

Share

Leave a Comment