క్యూట్ నెస్ తో అందరిని ఫిదా చేస్తుంది

సినిమా హీరోయిన్లను అభిమానించే వారి సంఖ్య.. లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. అంతగా తమ అందంతో అందరినీ కట్టిపడేస్తుంటారు. అయితే.. ఎంతటి అందగత్తెలు అయినా..

వీరు కూడా కొందరిని ఇష్టపడుతూ ఉంటారు. తమ అభిమానాన్ని ఇష్టాన్ని చూపుతూ ఉంటారు. కానీ ఒకే అమ్మాయిని అందరూ ఇష్టపడడం అంటే చెప్పుకోవాల్సిన విషయమే.

మహేష్ బాబు ఎంతటి ఫ్యామిలీ పర్సన్ అనే సంగతి తెలిసిందే. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ సరిపడ సమాయాన్ని కేటాయించి సూపర్ స్టార్ గానే కాకుండా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలి మాన్ గా ఉంటాడు.

ఇప్పుడు మహేష్ తో కలిసి భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ కైరా అద్వానీ. మహేష్ బాబు కూతురు సితారతో కలిసి ఈ భామ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

‘స్టన్నర్’ గా అభివర్ణిస్తూ ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు పెట్టింది కైరా. అంతలోనే ఈ చిన్నారితో ఎంతగా కలిసిపోయిందో అర్ధమవుతుంది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన నమ్రత “ఎవరి జుత్తు పొడవుగా వుంది? లాంగెస్ట్ హెయిర్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు” అని కాప్షన్ ఇచ్చారు.

మహేష్ సినిమాల్లో నటించే హీరోయిన్లు.. ఇలా సితారకు ఫ్రెండ్స్ అయిపోవడం చూస్తూనే ఉంటాం. గతంలో సమంత కూడా ఇలాగే మహేష్ కూతురితో తెగ ఇంటరాక్ట్ అయ్యింది.

ఆ సరదాల్లో కొన్నింటిని నెట్ లో కూడా పెట్టింది. ఇప్పటికీ సితార ఎక్కడా కనపడినా సమంత, రకుల్ ముద్దు చేస్తుండండం మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కైరా అద్వానీ కూడా చేరింది.

సినిమా హీరోయిన్స్ ను కూడా తనను తెగ అభిమానించేలా చేసేస్తోంది సితార. మరి ముద్దులొలికే చిన్నారి.. అందులోనూ మహేష్ బాబు కూతురు అంటే ఆమాత్రం ముద్దు చేయడం సహజమే.

చాన్నాళ్ల తర్వాత సితార పిక్స్ బయటకు వచ్చాయి. తల్లిదండ్రుల అందాన్ని పుణికిపుచ్చుకున్న ఈ పిల్ల తన క్యూట్ నెస్ తో మహేష్ అభిమానులను ఫిదా చేస్తోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Share

Leave a Comment