సితారతో ఛోటి ఛోటి బాతే

సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన సిల్వర్ జూబ్లీ సినిమా ‘మహర్షి’ తో చాలా బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే థమ్స్అప్ యాడ్ షూట్ కోసం దక్షిణఆఫ్రికా వెళ్ళి హైదరాబాద్‌కు తిరిగొచ్చారు మహేష్. ఇప్పుడు మళ్లీ మహర్షి షూటింగ్‌తో బిజీ అయిపోయారు ఆయన.

హైదరాబాద్‌లోనే జరుగుతోన్న మహర్షి షూటింగ్‌లో మహేష్‌కు ఆయన గారాలపట్టి సితార మండు వేసవిలో తన చిట్టి పొట్టి మాటలతో ఆహ్లాదాన్ని అందిస్తోంది. మహర్షి సెట్స్‌లో సితారతో సరదాగా గడిపిన కొన్ని ఫొటోలను మహేష్‌బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

‘నా సితా పాపతో ఛోటి ఛోటి బాతే. ఎల్లప్పుడూ నాలోని ఒత్తిడిని పోగొడుతుంది. ఆన్ సెట్స్ మహర్షి’ అని తన ట్వీట్‌లో మహేష్ పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు తను, సితార ఉన్న కొన్ని క్యూట్ ఫొటోలను కూడా షేర్ చేసారు. ఆ ఫొటోల్లో తన అల్లరితో అదరగొడుతుంది సితార. మొత్తానికి ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు తన కూతురితో సమయాన్ని గడుపుతున్నారు మహేష్.

అభిమానులకు తండ్రీ కూతుళ్ళను అలా చూడడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇద్దరినీ అలా చూడడానికి తమ రెండు కళ్ళు సరిపోవట్లేదు అని అంటున్నారు. దీంతీ ఇప్పుడు ఈ ఫొటోలు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా తెగ చక్కర్లు కొడుతున్నాయి. షేర్లు, కామెంట్లతో ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

మహేష్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది అభిమానులు క్యూట్ సితారకు కూడా ఉన్నారు. తండ్రితో పాటు షూటింగ్స్, సినిమా వేడుకలకు హాజరయ్యే సితార సామాజిక మాధ్యమాల్లో చేసే సందడికి వీరాభిమానులున్నారు. సితార ప్రతి పండగకు చేసే సందడి మామూలుగా ఉండదు. వినాయక చవితి, క్రిస్మస్, సంక్రాంతి, దసరా పండగ ఏదైనా సితార చేసే సందడి ఆషామాషీగా ఉండదు.

ఫ్రెండ్స్ తో కలిసి సితార ఒకటే అల్లరి చేసేస్తుంటుంది. అప్పుడ‌ప్పుడు మ‌హేష్ లేదా న‌మ్ర‌త సితారకి సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. వాటికి విపరీత‌మైన రెస్పాన్స్ వ‌స్తూ ఉంటుంది. మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఖాళీ టైం దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీతో గడపడానికే ఇష్టపడతాడు.

మహేష్ తన ఫ్యామిలీకి ఇచ్చే ప్రాదాన్యత గురించి అందరికీ తెలిసిందే. అలా ఆయన ఫ్యామిలీతో ఉన్న క్షణాలను ఫోన్ తో బందించి వాటిని తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. ఆ మధ్య సితార కు సంబంధించిన ఒక డాన్సిగ్ వీడియో ను కూడా షేర్ చేసారు మహేష్.

ఇక మహర్షి చిత్రంలోని తొలి పాట ‘ఛోటి ఛోటి బాతే’ను శుక్రవారం విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. శ్రీమణి రాసిన పాటకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచి స్వయంగా ఆలపించారు. ఈ పాట సింప్లీ సూపర్బ్‌గా ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.

ఈ పాటకు శ్రోతల నుంచి అదిరిపోయే ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఈ పాటకు 3.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కాలేజ్ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఆధారంగా వచ్చే ఈ సాంగ్‌ని మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే పై చిత్రీకరించారని ఈ వీడియోలోని స్టిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.

ఫస్ట్ సాంగ్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ ప్రేస్టిజియస్ మూవీలో కాలేజ్ స్టూడెంట్‌గా, ఎన్.ఆర్.ఐ.గా రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు మహేష్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ క‌థ ఎంతో విభిన్నంగా, స‌రికొత్తగా ఉంటుంద‌ని సినిమా యూనిట్ వెల్లడిస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి అభిమానులు క‌థ గురించి ఎన్నో వూహాగానాలు చేస్తుండ‌డం విశేషం. పోస్ట‌ర్‌లో మ‌హ‌ర్షి టైటిల్ వ‌ద్ద ఒక‌వైపు ప‌ల్లెటూరు, మ‌రోవైపు అమెరికా ఉండ‌డం ఇలా అన్నీ గమనించి తమకు తోచిన కథ అల్లుకుంటున్నారు. మ‌రి, అస‌లు ఈ సినిమా క‌థేంట‌న్న‌ది తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కూ ఆగాల్సిందే.

Share

Leave a Comment