మైండ్‌బ్లాక్ చేసేసిందిగా

మహేష్ ముద్దులు కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటి కప్పుడు తను చేసే పనులను మహేష్ బాబు అభిమానులతో పంచుకుంటుంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడ తనకు తోచిన అంశాలపై ఆమె తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి చర్చిస్తుంది

ఇక సితార తన తండ్రి మహేష్ పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ అదరగొడుతూ ఉంటుంది. అంతేకాదు ఆమె వేసే డ్యాన్స్‌ వీడియోలను ఎప్పటి కప్పుడు మహేష్ బాబుతో పాటు నమ్రత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు

ఇప్పటికే బాహుబలి సినిమాలోని పాటలతో పాటు తన తండ్రి మహేష్ బాబు నటించిన డాంగ్ డాంగ్ పాటలకు చిందేసి వార్తల్లో నిలిచిన ఈ చిట్టి తల్లి తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఫేమస్ సాంగ్ మైండ్ బ్లాక్‌కి తన దైన స్టైల్‌లో స్టెప్పులు వేసి అదరగొట్టింది

అంతలా అందరినీ తన డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. ఆ మూమెంట్స్, ఆ ఫేస్ ఫీలింగ్ అబ్బబ్బబ్బ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. నిజంగా సితార పాప డ్యాన్స్‌తో మైండ్‌బ్లాక్ చేసేసింది. ఇంకా నమ్మకం కలగకపోతే మీరూ ఆ డ్యాన్స్ వీడియోని చూసేయండి మరి

ఇపుడీ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రికి తగ్గ తనయగా అందరూ మాట్లాడుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార డ్యాన్స్‌కు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది. సితార అదరగొట్టావ్ అంటూ మెచ్చుకుంటున్నారు నెటిజన్స్

కుటుంబానికి అధిక ప్రాధాన్యత నిచ్చే మహేష్ బాబు లాక్ డౌన్ సమయాన్ని తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మహేష్ ఇంట్లో ఉండకపోతే ఇక్కడే ఉంటాడంటూ జిమ్‌ వీడియోను షేర్ చేసి వర్క్‌ అవుట్స్ విషయంలో మహేష్ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో క్లారిటీ ఇచ్చింది నమత్ర.

ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది మొదట్లోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ బాబు షార్ట్ గ్యాప్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారిపాట సినిమాను ఎనౌన్స్ చేశాడు, అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

మహేష్ చేయబోతున్న పరుశురాం సర్కారు వారి పాట సినిమా కూడా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అందుకు అనుగునంగా ఆయన కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. కమర్షియల్ సబ్జెక్ట్ అని చెప్తూనే ప్రయోగాలతో కెరీర్ ను విజయవంతంగా ముందుకు సాగిస్తున్నాడు ప్రిన్స్

Share

Leave a Comment