ఆయన ఎంచుకునే కథలు ఫెంటాస్టిక్

ప్రస్తుతం తమిళంలో వరుస హిట్స్ అందుకుంటున్న రైజింగ్ స్టార్ శివ కార్తికేయన్. యాంకర్‌ నుంచి కమెడియన్‌గా, తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హీరోగా.. ఇలా అంచలంచెలుగా ఎదిగారు. ఇలా తనలోని కొత్త టాలెంట్‌ను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారాయన.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మహేష్ అంటే తనకి ఇష్టం అని, అంతే కాదు శ్రీమంతుడు సినిమ షూటింగ్ సమయం లో మహేష్ దగ్గరికి వెళ్ళి షూటింగ్ నేరుగా చుసానని, తరువాత ఆయనతో ఒక పిక్ కూడా దిగి అది నెటిజెన్స్ కోసం షేర్ చేసినప్పుడు వైరల్ అయింది అని గుర్తు చేసారు.

యాంకర్ అడిగిన ప్రశ్న కు తనకి తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం అని.. తనకి అసలు తెలుగు గురించి తెలియని సమయం లో మహేష్ బాబు గురించి విన్నాను అని ఆయన వికీపీడియా పేజి లో ఆయన సినిమాల లిస్ట్ చూసాను అని ఆయన చేసిన సినిమాలు చాల తక్కువె అయిన ఆయన ఎంచుకునే స్టోరీ లైన్స్ ఫెంటాస్టిక్ అని కొనియాడారు.

ఆయన సక్సెస్ గ్రాఫ్ చాలా ఎక్కువ అని అసలు ఆయన అన్ని వరైటీ స్క్రిప్ట్స్ నేటి తరం లో ఎవరూ చేసి ఉండరు అని ప్రశంసించారు. ఒక రీజనల్ యాక్టర్ అయిన ఆయన క్రేజ్ టొటల్ ఇండియా వైడ్ ఊందంటేనే ఆయన ఎంట గొప్ప నటుడో తెలుస్తుంది అన్నారు.

ఇక్కడ మనకి తమిళం లో అనిరుధ్ ఎలానో తెలుగు లో సూపర్‌స్టార్ అలానే. అనిరుధ్ కేవలం రీజనల్ చేస్తూనే ఎంత పాపులర్ అయ్యారో అంతకముందే సూపర్‌స్టార్ అలా అయ్యరు. ఆయన వరైటీ స్క్రిప్ట్స్ చేస్తూ మాలాంటి హీరో లకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు అని తెలిపారు.

శ్రీమంతుడు సమయం లో మదురై లో మహేష్ బాబు షూట్ చేస్తున్న సెట్స్ ని విజిట్ చేసాను. “ఆయన చాలా హంబుల్ ఆండ్ డౌన్ టు యర్త్ .. అసలు అంత పెద్ద స్టార్ ని అని కొంచెం కూడా గర్వం లేదు. చాలా సరదగా ఉంటారు. పర్సనల్ గా తెలియకపోయినా పలకరించి చాలా బాగా మాట్లాడారు” అన్నారు.

Share

Leave a Comment